NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు
    తదుపరి వార్తా కథనం
    Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు
    యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు

    Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

    మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ, 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

    బోర్డు పదవీకాలాన్ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించామని, బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎటువంటి జీత భత్యాలు ఉండవన్నారు.

    వైటీడీ బోర్డు విద్యా సంస్థలను స్థాపించి, నిర్వహించే అధికారాన్ని కలిగి ఉంటుంది. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక,వేద విద్యా సంస్థలను నెలకొల్పే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    వైటీడీకి అవసరమైన బడ్జెట్ ఆమోదం ప్రభుత్వ ద్వారానే జరుగుతుందని, అలాగే ఈవోగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు.

    వివరాలు 

    ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలోకి..

    గతంలో యాదగిరిగుట్టలో భక్తుల కోసం తగిన వసతులు లేనప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి వాటిని అందుబాటులోకి తెచ్చిందని ఆమె గుర్తుచేశారు.

    ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి పాలక మండలి ఏర్పాటును నిర్ణయించినట్టు తెలిపారు.

    సమర్థవంతమైన పాలక మండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత ప్రగతిపథంలోకి తీసుకువెళ్తామని చెప్పారు.

    అలాగే, ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలోకి వస్తాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాదాద్రి

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    యాదాద్రి

    తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు తెలంగాణ
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే! భారతదేశం
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025