
లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీకి గుడ్‌బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావ్ సోమవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
యార్లగడ్డకు పసుపు కండువా కప్పిన లోకేశ్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాసేపటికి, లోకేశ్‌తో యార్లగడ్డ వెంకట్రావు విడిగా సమావేశం అయ్యారు. యార్లగడ్డ అంతమందు ఎన్నికలల్లో వైసీపీ తరుపున పోటీ చేసి తెలుగు దేశం అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇప్పుడు వంశీ వైసీపీకి దగ్గర కాగా, యార్లగడ్డ తెలుగుదేశంలో చేరారు. యార్లగడ్డ టీడీపీలో చేరగానే వంశీ పోవాలి.. యార్లగడ్డ గెలవాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Details
గన్నవరంలో రేపు తెలుగుదేశం భారీ బహిరంగ సభ
మంగళవారం(ఆగష్టు 22) గన్నవరంలో లోకేష్ నిర్వహిస్తున్న యువగళం భారీ బహిరంగ సభ జరుగనుంది.
ఈ బహిరంగ సభ కోసం తెలుగుదేశం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో యార్లగడ్డ చేరికతో పార్టీకి అదనపు బలం చేకూర్చిందని తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన యార్లగడ్డకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.