
ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు యాత్ర.. నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు యాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించనుంది.
నాలుగున్నరేళ్ల సీఎం వైఎస్ జగన్ పాలనలో జరిగిన సామాజిక విప్లవం, సంక్షేమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బస్సు కదలనుంది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. వైనాట్ 175 నినాదంతో అధికార వైసీపీ దూకుడు పెంచుతోంది.
ప్రజాక్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 4 కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆ పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్ పేర్కొన్నారు.
సామాజిక సాధికార యాత్ర ఉత్తరాంధ్రలో ఇవాళ ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురం, కోస్తాలోని తెనాలి, రాయలసీమలోని శింగనమల నియోజకవర్గాల్లో యాత్ర మొదలుకానుంది.
details
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఫలితంగా ఏపీలో పొలిటికల్ హీట్
ఏపీలో రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ డిసెంబరు 31 వరకు మొత్తం 39 నియోజకవర్గాలను టచ్ చేసేలా యాత్రను వైసీపీ అమలు చేస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఫలితంగా ఏపీలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. ఇప్పటికే జనసేన వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్తోంది.
ఇదే సమయంలో బుధవారం, నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే లోకేష్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి యువగళం పాదయాత్ర చేపట్టే అవకాశాలున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనకు దీటుగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్రకు ముహుర్తం పెట్టింది.