
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లేందుకు సీఎం జగన్ అనుమతిని కోరారు.
అలాగే ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు యూకే, యూఎస్ఏ, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.
సీఎం జగన్ అభ్యర్థనపై సీబీఐ అధికారులు స్పందించారు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో ఏపీ సీఎం జగన్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆగస్టు 30న జగన్ పిటిషన్‌పై విచారణ
(ఈటీవీ స్క్రోలింగ్) యూకే పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ – దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని కోరిన జగన్ – జగన్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సమయం కోరిన సీబీఐ – జగన్ పిటిషన్ పై విచారణ ఈ నెల 30కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు – లండన్ లోని కుమార్తె వద్దకు… pic.twitter.com/BWzZUQgkIk
— Saranya (@Saranya_abburi) August 28, 2023