Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన వైసీపీ ఎంపీ బాలశౌరి
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా జిల్లా రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, తన కుమారుడు వల్లభనేని అనుదీప్ తో కలిసి హైదరాబాదులోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు.
జనసేనానికి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి పవన్ తో భేటీ అయ్యారు.
ఈ భేటీలో వారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది.
బాలశౌరి జనసేనలో చేరడం ఖాయం కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలలో పెను మార్పులకు దారి తీయనుంది.
ఇదిలా ఉండగా.. ఆయన మచిలీపట్నం నుంచి బరిలోకి దిగుతారా లేదు గుంటూరు నుండి పోటీ చేస్తారా అనేది.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బాలశౌరి చేసిన ట్వీట్
జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారిని ఇవాళ హైదరాబాద్ లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, ఆయన కుమారుడు శ్రీ వల్లభనేని అనుదీప్ గారు..
— Vallabhaneni Balashowry (@VBalashowry) January 19, 2024
.
.#janasena #JanasenaPawanKalyan#PawanKalyan @JanaSenaParty #VallabhaneniBalashowry pic.twitter.com/TIrw00M7Dd