తదుపరి వార్తా కథనం

MP Balashowry: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా
వ్రాసిన వారు
Stalin
Jan 13, 2024
07:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
MP Balashowry: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కాయి.
నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, అభ్యర్థుల మార్పులతో వైసీపీ వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న పరిస్థితి నెలకొంది.
తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.
వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇస్తున్న నేపథ్యంలో సిట్టింగ్‌లు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎంపీ వైసీపీకి గుడ్ బై చెప్పారు.
వైసీపీలో వరుస రాజీనామాలు.. రాష్ట్ర రాజకీయాల్లో సంచనంగా మారాయి. త్వరలోనే ఎంపీ బాలశౌరి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైసీపీకి షాకిచ్చిన బాలశౌరి
వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా
— Harsha (@SunShineAndhra) January 13, 2024
Source : Tv9 pic.twitter.com/UGTmlXkiJc