Page Loader
TG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు 
తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు

TG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2024
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రాబోయే అయిదు రోజులు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో ఈనెల 21వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం ప్రస్తుతం చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, నెల్లూరుకు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య పుదుచ్చేరి, నెల్లూరు ప్రాంతాలకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

Deatails

భారీ వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో బుధవారం నిజామాబాద్‌, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. గురువారం, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు దృష్ట్యా ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.