
Priyanka Gandhi: 'కాశ్మీర్‌లో శాంతి ఉందంటారా?.. పహల్గామ్ దాడి గురించి ఏం చెబుతారు?' : లోక్‌సభలో ప్రియాంక గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో 'ఆపరేషన్ సిందూర్'పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్రాన్ని కఠినంగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాశ్మీర్‌లో శాంతి నెలకొంది. భూములు కొనుక్కొనండి అంటూ చెప్పారని గుర్తు చేస్తూ... అప్పుడు ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఎలా సాధ్యమైందని నిలదీశారు. పహల్గామ్ ఘటనపై స్పష్టత ఇవ్వకుండా, అధికారపక్ష నేతలు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారని విమర్శించిన ఆమె... ఆ దాడికి బాధ్యత ఎవరిది? కేంద్ర నిఘా సంస్థలు విఫలమయ్యాయా? అని ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎఫ్ (TRF) ఉగ్ర సంస్థ కొత్తగా ఏర్పడినదేమీ కాదని, 2024లో ఆ సంస్థ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు వివరించారు.
Details
కాంగ్రెస్ పాలకవర్గమే కారణమని ధ్వజం
అలాంటి నేపథ్యంలో పహల్గామ్‌లో భద్రతా బలగాలే లేకపోవడం ఆశ్చర్యకరమని, కేంద్రం చర్యలు ఏమిటి? హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ రాజీనామా చేసారా? అని గట్టిగా నిలదీశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. విపక్షాల విమర్శలను ఖండించిన ఆయన, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు కాంగ్రెస్ పాలకవర్గాలే కారణమని ధ్వజమెత్తారు. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే దేశాన్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయని విమర్శించారు. మహాదేవ్ ఆపరేషన్‌లో భాగంగా పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని సైన్యం చిత్తు చేసిందని వెల్లడించారు. భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా సుమారు 100 మంది ఉగ్రవాదులను ఖతం చేసినట్లు కేంద్రం ప్రకటించింది.