Uttar pradesh : సీట్ల విషయంలో వివాదం.. కదులుతున్న బస్సులో బీజేపీ నాయకుడిని కొట్టిన రౌడీలు
ఉత్తర్‌ప్రదేశ్'లోని లఖింపూర్ ఖేరీలోని పాలియా ప్రాంతంలో బస్సులో సీటు గురించి వివాదం జరిగింది. ఈ సమయంలో,రౌడీలు పాలియా నగర్ బిజెపి అధ్యక్షుడు ఉదయవీర్ సింగ్, అతని మద్దతుదారులను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గొడవ జరిగిన బస్సు గోరీ ఫాంటా నుంచి పాలియాకు వస్తోంది. పాలియా బీజేపీ నగర అధ్యక్షుడు ఉదయవీర్ సింగ్ తన స్నేహితులతో కలిసి గోరీ ఫాంటా నుంచి పాలియాకు వస్తున్నారు. అదే సమయంలో బస్సులో సీటు విషయంలో అవతలి వారితో వాగ్వాదానికి దిగారు.ఈ వివాదం ఎంతగా పెరిగిపోయిందంటే,ఇతర పార్టీకి చెందిన వ్యక్తులు బీజేపీ నగర అధ్యక్షుడు ఉదయ్‌వీర్‌సింగ్‌ను,ఆయన మద్దతుదారులను కొట్టారు. ఈ ఘటనను అక్కడున్న వ్యక్తులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది.
దాడిపై పోలీసులు కేసు నమోదు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే,లఖింపూర్‌కు చెందిన స్థానిక జర్నలిస్ట్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్‌లో వార్తను వైరల్ చేశాడు. దీని తర్వాత, వార్తను వైరల్ చేసిన జర్నలిస్టును బీజేపీ నగర అధ్యక్షుడు ఉదయవీర్ సింగ్ సహాయకుడు దుర్భాషలాడాడు, చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బస్సులో జరిగిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ నేత,ఇతర కార్యకర్తలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ ఎస్పీ ఈస్ట్ పవన్ గౌతమ్ తెలిపారు. ఇదే విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.ప్రజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు.