Page Loader
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల 
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2024
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల మంగళవారం నియమితులయ్యారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి. ఆమె జనవరి 4న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వైఎస్‌ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.

Details 

రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్‌ షర్మిల బిజీ

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి.. వైఎస్ షర్మిలకు లైన్‌ క్లియర్‌ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో రుద్రరాజు పదవీ విరమణ నిర్ణయాన్ని తెలియజేసినట్లు వార్తా సంస్థ IANS తెలిపింది. అయితే, ప్రస్తుతం తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్‌ షర్మిల బిజీగా ఉన్న విషయం విదితమే.