Page Loader
YS sharmila: మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల 
YS sharmila: మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల

YS sharmila: మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 04, 2024
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు.ఆమెకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అగ్రనేతలు. అనంతరం ఆమో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరివరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని ఇప్పుడు ఆయన బిడ్డగా మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా.. స్వీకరిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలనన్నదే లక్ష్యమని.. దానికోసం అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ పార్టీ ట్వీట్