YS Sharmila: బెంగళూరు సమీపంలో షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలీరెడ్డి, రఘురామిరెడ్డిల వివాహ వేడుక బెంగళూరు సమీపంలోని నందిహిల్స్‌లో ఘనంగా జరిగింది. అక్కడి 'మనధీర' రిసార్టులో బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం వివాహాన్ని నిర్వహించారు. ఇరు కుటుంబాల నుంచి వంద మంది చొప్పున పరిమిత సంఖ్యలో అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, షర్మిల సోదరుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్‌రెడ్డికి ఈ వివాహానికి ఆహ్వానం అందలేదు.
వివరాలు
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక
జగన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన బంధువులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
కాగా, గురువారం నందిహిల్స్ పరిసర ప్రాంతాల్లోని మరో రిసార్టులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు రాష్ట్ర రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
అయితే, డీకే శివకుమార్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నందిహిల్స్‌లో రెండు సంప్రదాయాల్లో షర్మిల కుమార్తె వివాహం
మేనమామ జగన్ లేకుండానే షర్మిల కుమార్తె పెళ్లి?
— News Grid 24 (@NewsGrid_24) November 25, 2026
బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో ఇవాళ వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి, రఘురామ్ రెడ్డి వివాహం జరగనుంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించిన షర్మిల, తన సోదరుడు వైఎస్ జగన్‌కు ఆహ్వానం పంపలేదని సమాచారం.
యలహంక నివాసంలో పెళ్లి… pic.twitter.com/E9bSMiq64x