Page Loader
YS Sharmila: కుమారుడి పెళ్లి, నిశ్చితార్ధం తేదీలను వెల్లడించిన షర్మిల 
YS Sharmila: కుమారుడి పెళ్లి, నిశ్చితార్ధం తేదీలను వెల్లడించిన షర్మిల

YS Sharmila: కుమారుడి పెళ్లి, నిశ్చితార్ధం తేదీలను వెల్లడించిన షర్మిల 

వ్రాసిన వారు Stalin
Jan 01, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన కుమారుడి పెళ్లి, నిశ్చితార్ధ తేదీలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియాతో తన కొడుకు రాజారెడ్డి పెళ్లి జరగబోనున్నట్లు వైఎస్‌ షర్మిల వెల్లడించారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. జనవరి 18న ఎంగేజ్‌మెంట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తన కుమారుడి పెళ్లి గురించి పంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తాము కుటుంబ సమేతంగా మంగళవారం ఇడుపులపాయకు కాబోయే వధూవరులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తామని షర్మిల వెల్లడించారు. తొలి పెళ్లి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచుతామని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైఎస్ షర్మిల ట్వీట్