Page Loader
Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్
Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా

Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2024
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీలో రాజీనామాల పరంపరకు బ్రేక్ పడడంలేదు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ ఎంపీ పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఈ సారి ఎమ్మిగనూరు స్థానాన్ని ఆశించారు. అయితే అధిష్ఠానం ఆ స్థానాన్ని ఆయనకు ఇవ్వకపోగా, కర్నూలు పార్లమెంటు ఇన్‌ఛార్జిగా గుమ్మనూరి జయరాంను నియమించారు. దీంతో సంజీవ్ కుమార్ పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. కర్నూలు ప్రాంతంలో మంచి డాక్టర్ గా ఆయనకు మంచి పేరుంది. అందుకే గత ఎన్నికల్లో జగన్ పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. మరి ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంజీవ్ కుమార్ చేనేత సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైసీపీకి కర్నూలు ఎంపీ రాజీనామా