YSRCP: 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడదుల
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి మెజార్టీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా వైసీపీ తమ క్యాండిడెట్ల జాబితాను వెల్లడించేందుకు సిద్ధమవువుతోంది. ఈనెల 16న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విడతల వారీగా కాకుండా ఒకేసారి మొత్తం సీట్లను వైసీపీ ప్రకటించనుంది. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ స్వయంగా ప్రకటిస్తారని వైసీపీ పేర్కొంది. అయితే సమన్వయకర్తలనే సీఎం జగన్ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.