Page Loader
Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 19, 2025
09:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయనను నాల్గవ నిందితుడిగా పేర్కొన్నఎస్ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎస్ఐటీ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనఅరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎస్ఐటీ అధికారులు అధికారికంగా తెలియజేశారు. ఈకుంభకోణానికి సంబంధించి లిక్కర్ పాలసీ తయారీ,నకిలీ కంపెనీలకు ముడుపుల పంపిణీ తదితర అంశాలపై మిథున్ రెడ్డిని ఎస్ఐటీ అధికారులు విచారించినట్లు సమాచారం. ఆయన ఎవరెవరితో గోప్యంగా సమావేశాలు నిర్వహించారన్న విషయాన్ని కూడా ఎస్ఐటీ బృందం ఆరా తీసినట్లు సమాచారం. నకిలీకంపెనీల ద్వారా వచ్చిన నిధులు చివరికి ఎవరి వద్దకు చేరుకున్నాయన్నఅంశంపై సైతం మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ 

మునుపటి ప్రభుత్వ హయాంలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా సాగేదని, అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో మాన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టడంలో మిథున్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని ఎస్ఐటీ గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చగా, తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.