Page Loader
RK Roja: నగరిలో ఓటమి ఒప్పుకున్నా రోజా.. ఊహించని ట్వీట్..
RK Roja: నగరిలో ఓటమి ఒప్పుకున్నా రోజా.. ఊహించని ట్వీట్..

RK Roja: నగరిలో ఓటమి ఒప్పుకున్నా రోజా.. ఊహించని ట్వీట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. అందరు మంత్రులు ఓటమికి అంచు దూరంలో ఉన్నారు. ఇక నగరిలో మంత్రి ఆర్‌కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై 5333 ఓట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉండగా.. రోజా ఓటమి దిశగా పయనిస్తున్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి.

Details 

ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్

ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. 'భయాన్ని విశ్వాసంగా... ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు' అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రోజా చేసిన ట్వీట్