Page Loader
YS Sharmila:నేడు కాంగ్రెస్ లో చేరనున్న వైఎస్ షర్మిల 
YS Sharmila:నేడు కాంగ్రెస్ లో చేరనున్న వైఎస్ షర్మిల

YS Sharmila:నేడు కాంగ్రెస్ లో చేరనున్న వైఎస్ షర్మిల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 04, 2024
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఢిల్లీలో షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ అగ్రనేతలతో సమావేశమవనున్నారు. హస్తం పార్టీ అగ్రనేతల సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని, కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన తర్వాత షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Details

వైఎస్ జగన్ నివాసానికి షర్మిల

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ అవినీతి, ప్రజావ్యతిరేక పాలనను అంతం చెయ్యడానికే తను మద్దతు పలుకుతున్నట్లు ఆమె తెలిపారు. ఇక, బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసానికి షర్మిల వెళ్లారు. ఈ సందర్భంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందజేశారు. ఆమె భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కోబోయే కోడలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి షర్మిల దాదాపు అరగంట సమావేశం అయ్యారు.