Loading...
Tamil Nādu: 24 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నాలుగేళ్లుగా ఒక్కరూ పాస్‌ కాలేదు
24 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నాలుగేళ్లుగా ఒక్కరూ పాస్‌ కాలేదు

Tamil Nādu: 24 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నాలుగేళ్లుగా ఒక్కరూ పాస్‌ కాలేదు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అన్నా యూనివర్సిటీ పరిధిలోని 24 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో గత నాలుగేళ్లుగా ఉత్తీర్ణత శాతం సున్నాగా నమోదైంది. 2021 నుంచి 2025 మధ్య ఈ కళాశాలల్లో చదివిన 2,425 మంది విద్యార్థుల్లో ఒక్కరూ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని యూనివర్సిటీ పరీక్షల రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితిపై అన్నా యూనివర్సిటీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఏటా రెండుసార్లు పరీక్షలు

అన్నా యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏటా సెమిస్టర్‌ పరీక్షలను నవంబరు-డిసెంబరు, ఏప్రిల్‌-మే నెలల్లో నిర్వహిస్తారు.

ఈ పరీక్షల ఫలితాల వివరాలను పరిశీలించగా 24 కళాశాలల్లో వరుసగా నాలుగేళ్లపాటు ఉత్తీర్ణత శాతం సున్నాగా ఉన్నట్లు తేలింది.

2021-2025 మధ్య ఆయా కళాశాలల్లో చదివిన 2,425 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

వివరాలు 

పెను ప్రమాదమే..

కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు తక్కువగా ఉండటంతోపాటు విద్యా ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి కళాశాలల్లో చేరే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు.

ఇలాంటి సంస్థలకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని అన్నా యూనివర్సిటీ సరిదిద్దకపోతే విద్యార్థులు తమ భవిష్యత్తును నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పెను ప్రమాదమే..

కేవలం సీట్ల పెంపుపైనే దృష్టి పెట్టకుండా ఫలితాలు సాధించలేని, అడ్మిషన్లు కూడా పొందలేని కళాశాలల పనితీరును సమీక్షించాలని సూచిస్తున్నారు.

ఇలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే ప్రతిభ చూపని కళాశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వి.కుమరేశన్‌ తెలిపారు.

ఇలాంటి కళాశాలల వివరాలను సేకరిస్తున్నామని, విచారణ చేపట్టి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

కోర్సుకు ఒకరిద్దరే..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 418 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 2.54 లక్షల మంది విద్యార్థులు చదివే సామర్థ్యం ఉంది.

ఈ ఏడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సుమారు 2 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి.

అయితే మరోవైపు అనేక ఇంజినీరింగ్‌ కళాశాలలు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి.

అన్నా యూనివర్సిటీ పరిధిలోని గణాంకాలను పరిశీలిస్తే 100 శాతం అడ్మిషన్లు పొందిన ఇంజినీరింగ్‌ కళాశాలలు కేవలం 35 మాత్రమే ఉన్నాయి.

వివరాలు 

కోర్సుకు ఒకరిద్దరే..

మరో 104 కళాశాలల్లో 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇది పరిస్థితిలో ఒక కోణం మాత్రమే. మరోవైపు 24 కళాశాలల్లో 10 శాతం కంటే తక్కువగా అడ్మిషన్లు నమోదయ్యాయి.

వీటిలో 15 కళాశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 10 మందికి కూడా మించలేదు. కొన్ని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు గణాంకాలను బట్టి అంచనా వేయొచ్చు.

ఇక ఏకంగా 177 కళాశాలల్లో కనీసం 50 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం కూడా కష్టంగా మారినట్లు గణాంకాల విశ్లేషణలో వెల్లడవుతోంది.

దీంతో తక్కువ అడ్మిషన్లు, తక్కువ ఉత్తీర్ణత నమోదవుతున్న కళాశాలల పనితీరుపై సమగ్ర సమీక్ష అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT