LOADING...
రూ.10 లక్షల బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
రూ.10 లక్షల ఖరీదైన బైక్ పై ఫుడ్ డెలివరీ

రూ.10 లక్షల బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 10, 2023
06:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ డెలివరీ బాయ్ దాదాపు రూ.10లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సదరు డెలివరీ బాయ్ ని ఓ వ్యక్తి బతకడానికి ఏం చేస్తుంటారు అని అడిగారు. బైక్ పై దర్జాగా కూర్చున్న వ్యక్తి తాను జొమాటోలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. నెలకు రూ.45 వేలు సంపాదిస్తున్నట్లు కుండబద్దలు కొట్టాడు. ఆర్డర్ తీసుకున్నామా, ఇచ్చామా, డబ్బులు తీసుకున్నామా అంతేనని గొప్పగా చెప్పాడు. ఈ వీడియోను రాజ్ కుమార్ అనే వ్యక్తి తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. డుకాటి ఇండియా ఎమోజీలతో కామెంట్స్ చేయగా, డెలివరీ బాయ్ మాత్రం వాహనం తనది కాదని చెప్పడం, తాను త్వరలోనే కొంటానని చెప్పడం కొసమెరుపు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో