గాంధీ జయంతి 2024: మహత్మా గాంధీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలివే!
మహాత్మా గాంధీ కృషి భారత స్వతంత్ర ఉద్యమంలో ఎప్పటికీ మరువలేనిది. 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించిన గాంధీ, దేశం కోసం తన జీవితాన్ని అర్పించారు. ప్రతి ఏటా గాంధీ పుట్టిన రోజు అక్టోబర్ 2న గాంధీ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఆయనను ప్రజలు జాతిపితగా గౌరవిస్తారు, బాపూ అని ప్రేమగా పిలుస్తారు. గాంధీకి సంబంధించిన కొన్ని అద్భుతమైన విషయాలు మనకు పాఠ్యపుస్తకాల్లో తెలుసు. అయితే గాంధీజి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సత్యం, అహింస వంటి విలువలను ప్రపంచానికి బోధించిన గాంధీకి నోబెల్ శాంతి బహుమతి రాలేదు.
నోబెల్ బహుమతి దక్కలేదు
1937, 1938, 1939, 1947, 1948 సంవత్సరాల్లో నామినేట్ అయినా, గాంధీజీకి ఆ పురస్కారం దక్కకపోవడం గమనార్హం. ఆయన హత్య జరిగిన 1948లో కూడా నామినేట్ అయినా కానీ ఆ ఏడాది నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వలేదు. గాంధీ తన 13 ఏళ్ల వయసులోనే కస్తూర్బా మకాంజీతో వివాహమైంది. అది ఒక అరేంజ్డ్ మ్యారేజ్. నిశ్చితార్థం గాంధీ చిన్న వయసులోనే జరిగింది. ఈ వివాహంతో గాంధీకి నలుగురు కొడుకులు ఉన్నారు.
గాంధీ ఉద్యమం దక్షిణాఫ్రికాలో ప్రారంభం
న్యాయవిద్యలో పట్టా పొందిన గాంధీ, 1893లో దక్షిణాఫ్రికాలోని భారతీయ సంస్థలో పనిచేశారు. గాంధీని భారతీయుల పౌర హక్కుల కోసం దక్షిణాఫ్రికాలో ఉద్యమం ప్రారంభించడానికి ప్రేరేపించింది. గాంధీ హత్య భారత స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన కృషి ఎనలేనిది. ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన కొన్ని నెలల తర్వాత, 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతుల్లో గాంధీజీ ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఇంటిపేరు కారణంగా మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ బంధువులని చాలామంది అనుకుంటారు. కానీ వీరు అసలు బంధువులే కాదు. ఇందిరా గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె.