Loading...
British Loan Dispute: 109 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిటీష్ అప్పు.. భారతీయుడి మనవడి నోటీసు..!
భారతీయుడి మనవడి నోటీసు..!

British Loan Dispute: 109 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిటీష్ అప్పు.. భారతీయుడి మనవడి నోటీసు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు "రవి అస్తమించని సామ్రాజ్యం"గా పేరొందిన బ్రిటీష్ సామ్రాజ్యం, ఓ భారతీయుడి వద్ద నుంచి అప్పు తీసుకుంది. ఆశ్చర్యకరంగా, ఆ అప్పు 109 సంవత్సరాలుగా తిరిగి చెల్లించబడలేదు. ఇప్పుడు ఆ అప్పుదాత మనవడు, తమ కుటుంబానికి చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ బ్రిటీష్ ప్రభుత్వానికి నోటీసు పంపేందుకు సిద్ధమవుతున్నారు. అసలు బ్రిటీష్ పాలకులు ఆ అప్పు ఎందుకు తీసుకున్నారు? ఇంతకాలం ఎందుకు చెల్లించలేదు? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.

వివరాలు 

ఆ కాలంలోనే ఆయన వద్ద రోల్స్-రాయ్స్ కారు

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌కు సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రాధాన్యమున్న సెహోర్ జిల్లా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

బ్రిటీష్ పాలన కొనసాగుతున్న రోజుల్లో సెహోర్ ప్రాంతంలో అత్యంత ధనవంతులలో సేఠ్ జుమ్మా లాల్ ప్రముఖుడిగా నిలిచారు.

ఆ కాలంలోనే ఆయన వద్ద రోల్స్-రాయ్స్ కారు ఉండటం ఆయన ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది.

భోపాల్, ఇండోర్, రాజ్‌గఢ్ ప్రాంతాల్లో కూడా సేఠ్ జుమ్మా లాల్ మంచి ఖ్యాతిని సంపాదించారు.

పేదలకు సహాయం చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యసాయం అందించడం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండేవారు.

సమాజహితం కోసం మాత్రమే కాకుండా, అవసరమైన సందర్భాల్లో బ్రిటీష్ అధికారులకు కూడా విరాళాలు అందజేశారు.

వివరాలు 

ఆ అప్పు ఇచ్చిన 20 సంవత్సరాల తరువాత సేఠ్ జుమ్మా లాల్ మృతి 

సేఠ్ జుమ్మా లాల్ వ్యక్తిత్వం, ఆర్థిక స్థోమత కారణంగా బ్రిటీష్ ఉన్నతాధికారులు కూడా ఆయనను గౌరవించేవారు.

ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత ఏర్పడినపుడు ఆయన వద్ద నుంచి అప్పులు తీసుకునేవారు.

ఈ నేపథ్యంలో, 1917లో మొదటి ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటీష్ ప్రభుత్వం సేఠ్ జుమ్మా లాల్ వద్ద నుంచి రూ.35 వేల రూపాయలను అప్పుగా తీసుకుంది.

ఆ మొత్తానికి బదులుగా ఒక బాండ్ పత్రాన్ని అందజేసింది.

ఆ అప్పు ఇచ్చిన 20 సంవత్సరాల తరువాత, 1937లో సేఠ్ జుమ్మా లాల్ మరణించారు.

అనంతరం ఆ బాండ్ ఆయన కుమారుడు మనక్ చంద్ర రూథియా చేతికి వెళ్లింది. మనక్ చంద్ర 2013లో కన్నుమూశారు.

ADVERTISEMENT

వివరాలు 

బాండ్ ఆధారంగా బ్రిటన్ ప్రభుత్వానికి నోటీసు

మనక్ చంద్ర మరణానంతరం ఆ బాండ్ ఆయన కుమారుడు వివేక్ రూథియా వద్దకు వచ్చింది.

బాండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన ఆయనకు, సైనిక అవసరాల నిమిత్తం ఈ రుణాన్ని తీసుకున్నట్లు బ్రిటీష్ పాలకులు అందులో పేర్కొన్న విషయం స్పష్టమైంది.

ఇప్పుడు అదే బాండ్ ఆధారంగా బ్రిటన్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని వివేక్ నిర్ణయించారు.

సేఠ్ జుమ్మా లాల్ వారసుడిగా తమ కుటుంబానికి రావలసిన మొత్తాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

అప్పట్లో ఇచ్చిన రూ.35 వేల రూపాయలు నేటి విలువ ప్రకారం సుమారు రూ.2 కోట్లు 

ఈ చర్యను తాను డబ్బు కోసం చేపడుతున్నది కాదని, భారత చరిత్రలో నమోదుకాని అంశాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశంతోనే ముందుకొస్తున్నానని వివేక్ వివరించారు.

1917లోని ఒక రూపాయి విలువ ప్రస్తుతం సుమారు 400 రూపాయలకు సమానమని ఆయన అంచనా వేశారు.

ఆ లెక్క ప్రకారం అప్పట్లో ఇచ్చిన రూ.35 వేల రూపాయలు నేటి విలువ ప్రకారం సుమారు రూ.2 కోట్లకు సమానమవుతాయని, దీనికి వడ్డీ జోడిస్తే మొత్తం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నోటీసును బ్రిటన్ ప్రభుత్వానికి పంపే హక్కు ఆ కుటుంబానికి ఉన్నదని న్యాయవాది ధీరజ్ కుమార్ స్పష్టం చేశారు.

ADVERTISEMENT