పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి
క్రిస్మస్ సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. పండగ రోజు ఏం చేయాలన్న ప్రణాళికను చాలామంది ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నారు. ఆ ప్రణాళికలో పిల్లల బహుమతులు కూడా ఉంటున్నాయి. మీరు మీ పిల్లలకు క్రిస్ మస్ రోజున బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా? ఐతే ఈ సారి కొంచెం కొత్తగా వీటిని ట్రై చేయండి. చిన్నపిల్లలు ఎక్కువగా బొమ్మలను ఇష్టపడతారు. కానీ ఆల్రెడీ మీ పిల్లల దగ్గర చాలా బొమ్మలు ఉండి ఉంటాయి. సో మళ్ళీ బొమ్మల జోలికి వెళ్ళకుండా కొత్తగా ఆలోచించండి. బేబీ వాకర్: అప్పుడే సంవత్సరం పూర్తయిన పిల్లలకు బేబీ వాకర్ ని గిఫ్ట్ గా ఇవ్వండి. దానివల్ల వాళ్ళు నడక నేర్చుకోవడంతో పాటు మీకు కూడా వాళ్ళను ఊరికే పట్టుకోవాల్సిన పని ఉండదు.
పిల్లల కోసం క్రిస్మస్ పండుగ బహుమతులు
పొలరాయిడ్ కెమెరా: మీ పిల్లలు 5, 6 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే పొలరాయిడ్ కెమెరాను బహుమతిగా ఇవ్వండి. ఈ కెమెరాతో ఫోటో తీస్తే వెంటనే ప్రింట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ అనుభవం పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తుంది. చిన్న టెంట్: పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న టెంట్ తీసుకోండి. దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకునేలా, మరలా తీసివేసుకునే విధంగా ఉండాలి. దీనివల్ల పిల్లలకు ప్రైవసీ అలవాటు అవుతుంది. డ్రాయింగ్ కిట్: మీ పిల్లలు డ్రాయింగ్ లో మక్కువ చూపెడుతున్నట్లయితే మంచి డ్రాయింగ్ కిట్ ని బహుమతిగా ఇవ్వండి. కలర్ స్కెచెస్ తో మురిసిపోతూ డ్రాయింగ్ మీద మరింత దృష్టి పెడతారు. సంగీత సాధనం కీబోర్డ్ ప్లేయర్ ని కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.