గజ్జి, దురదను పోగొట్టే ఇంటి చిట్కాలు ఇప్పుడే తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
సార్కోప్టేస్ స్కేబీ పురుగుల కారణంగా గజ్జి, దురద అంటుకుంటాయి. ఇది అంటువ్యాధి. గజ్జి లక్షణాలు ఎక్కువగా చేతివేళ్లమీద, మణికట్టు భాగంలో కనిపిస్తాయి.
గజ్జి వల్ల దురద, చికాకు, దద్దుర్లు కలుగుతాయి. దీని బారినుండి బయటపడడానికి కొన్ని ఇంటిచిట్కాలు పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టీ ట్రీ ఆయిల్: గజ్జిని కలుగజేసే పురుగులను చంపడంలో టీ ట్రీ ఆయిల్ ప్రభావ వంతంగా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ తో మిక్స్ చేసి గజ్జి పుండ్లు ఎక్కడైతే తయారయ్యాయో అక్కడ మర్దన చేసుకోవాలి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
కలబంద: దీని ఆకుని తీసుకుని గుజ్జును బయటకు తీసి, దానికి కొంత కొబ్బరినూనె కలిపి గజ్జి లేచిన ప్రాంతంలో మర్దన చేసుకుంటే చాలు.
ఆరోగ్యం
గజ్జిని తరిమికొట్టే ఇంటి చిట్కాలు
పసుపు: దీనిలో ఆరోగ్యాన్ని అందించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది దురద నుండి విముక్తి కలిగించడమే కాకుండా దురద వల్ల ఏర్పడిన పుండ్లను తగ్గిస్తుంది. పసుపును వేపనూనెలో కలిపి మర్దన చేస్తే సరిపోతుంది. అలా కాకుండా పసుపును నిమ్మరసంలో కలిపి మర్దన చేసుకుని కాసేపయ్యాక కడిగేస్తే గజ్జి తగ్గిపోతుంది.
లవంగాల నూనె: గజ్జివల్ల ఏర్పడ్డ దద్దుర్లను, కురుపులను తగ్గిస్తుంది. లవంగాల నూనెలో కొంచెం తేనె, కొబ్బరి నూనె కలిపి రోజుకు రెండుసార్లు మర్దన చేస్తే దురద తగ్గిపోతుంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి గజ్జి తొందరగా వ్యాపిస్తుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత పాటించాలి. పడుకునే బట్టలను 15రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఉతకాలి.