
మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ పీల్స్
ఈ వార్తాకథనం ఏంటి
చర్మాన్ని అందంగా ఉంచుకునేందుకు ఫేస్ పీల్స్ వాడుతుంటారు. వీటివల్ల చర్మంపై ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది.
మార్కెట్లో చాలా రకాల ఫేస్ పీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవై ఉంటాయి, అదీగాక ఒక్కోసారి సున్నితమైన చర్మానికి రసాయనాలున్న ఫేస్ పీల్స్ హాని చేస్తాయి.
అందుకే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ పీల్స్ వాడండి.
చక్కెర, తేనె తో తయారయ్యే ఫేస్ పీల్:
చక్కెర, తేనె, కొన్ని నీళ్ళు కలిపి గ్రైండర్ లో రుబ్బి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్టును సన్నని పొరలాగా ముఖం మీద రుద్దుకోండి. 5నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి.
Details
చర్మాన్ని అందంగా మార్చే ఫేస్ పీల్స్
గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం:
నిమ్మరసంలోని హైడ్రాక్సిల్ ఆమ్లం వల్ల చర్మం మీద నిలిచిపోయిన వ్యర్థ పదార్థాలు దూరమవుతాయి. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. గుడ్డులోని తెల్లసొన వల్ల చర్మం మృదువుగా మారుతుంది. గుడ్డు తెల్లసొన, నిమ్మరసాన్ని మిక్స్ చేసి ముఖానికి మర్దన చేయండి. 30నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి.
టమాట, కలబంద ఫేస్ పీల్:
సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ ఫేస్ పీల్ ని ఉపయోగిస్తే మంచి ఫలితం పొందుతారు. ఈ ఫేస్ పీల్ కారణంగా నల్లమచ్చలు దూరమైపోతాయి. చర్మం బిగుతుగా మారుతుంది. నిస్సారంగా కనిపించే చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.
టమాట, కలబంద రసాన్ని ఒక దగ్గర కలిపి ముఖం మీద మర్దన చేసుకోండి. 30నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి.