చర్మం మీద ముడుతలను, గీతలను పోగొట్టే పుట్టగొడుగులు
ఆహారంగా ఉండే పుట్టగొడుగులు ఆయుర్వేదంలా మారి చర్మ సంరక్షణలో సాయపడతాయని మీకు తెలుసా? ప్రస్తుతం చర్మ సంరక్షణ కోసం తయారు చేసే సాధనాల్లో పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు. మరి పుట్టగొడుగులు చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. చైనా ప్రజలు తమ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పుట్టగొడుగులను ఉపయోగించడం ఎన్నో ఏళ్ళ క్రితమే మొదలెట్టారు. ఇప్పుడు మన మార్కెట్లో పుట్టగొడుగు పదార్థాలతో నిండిన చర్మ సాధనాలు వస్తున్నాయి. పుట్టగొడుగుల్లో చాలా రకాలున్నాయి. ఏ రకమైన పుట్టగొడుగులు చర్మానికి ఏ రకమైన మేలు చేస్తాయో చూద్దాం. రెయిషీ రకం: ఇందులో యాంటీయాక్సిడెంట్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మం మీద గీతలు, ముడుతలు మాయమైపోతాయి. షిటాకే రకం పుట్టగొడుగుల వల్ల నల్లమచ్చలు తొలగిపోతాయి.
పుట్టగొడుగుల రకాల వల్ల చర్మానికి కలిగే లాభాలు
ట్రెమల్లా పుట్టగొడుగులు: ఇందులో పాలిశాకరైడ్లు ఉంటాయి కాబట్టి చర్మాన్ని తేమగా ఉంచడంలో ఇవి సాయం చేస్తాయి. కార్డిసెప్స్, కాప్రినస్, చాగా పుట్టగొడుగులు: కార్డిసెప్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కావున నల్లమచ్చలు తొలగిపోతాయి. అంతేకాదు కొల్లాజెన్ ఉత్పత్తిలో సాయం చేస్తుంది. కాప్రినస్ పుట్టగొడుగుల కారణంగా చర్మం పొడిబారకుండా ఉంటుంది. మెలనిన్ ఉత్పత్తిని తక్కువ చేయడంలో చాగా పుట్టగొడుగులు సాయపడతాయి. పుట్టగొడుల పదార్థాలతో తయారైన చర్మ సాధనాలను ఎలా వాడాలంటే: ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పీహెచ్ స్థాయిలను సరిగ్గా ఉంచే టోనర్ ను వాడండి. తర్వాత పుట్టగొడుగు పదార్థాలతో తయారైన మాయిశ్చరైజర్ ని వాడండి. ఆ తర్వాత పుట్టగొడుగు పదార్థాలతో తయారైన సన్ స్క్రీన్ ని లోషన్ ని ఉపయోగించండీ.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి