శరీరంలో వచ్చే మార్పులను కంటి సమస్యల ద్వారా ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోండి
ఈ ప్రపంచాన్ని చూసే కన్నులు, మీ అనారోగ్య లక్షణాలను చాలా తొందరగా తెలియజేస్తాయి. శరీర ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, అది కంటి సమస్యల రూపంలో కనిపిస్తుంటుంది. అదెలాగో చూద్దాం. కళ్ళు దురద పెడుతుంటే: కోవిడ్ 19 కారణంగా జ్వరం, అలసట, దగ్గు లక్షనాలు కనిపిస్తాయి. కానీ కళ్ళు దురద పెట్టడం కూడా జరుగుతుందని మీకు తెలుసా? కోవిడ్ కొత్త వేరియంట్ XBB.1.16 అనే రకం సోకితే కళ్ళు దురదపెడుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పెరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మసక మసగ్గా కనిపిస్తుంటే: రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కావడం వలన కంటిచూపు మసక మసకగా మారుతుంది. కంటిలోని రక్తనాళాల్లోంచి రక్తం లీక్ అవడం కారణంగా కళ్ళు సరిగ్గా కనిపించవు.
శరీరంలోకలిగే మార్పుల వల్ల కంటికి వచ్చే సమస్యలు
కార్నియా చుట్టూ రింగ్ లా కనిపించడం: కార్నియా అంచుల్లో ఒక రింగ్ లాగా ఏర్పడుతుంది. గోధుమ రంగు లో ఉండే రింగ్, బయటకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళలో ఇలాంటి రింగ్ ఏర్పడుతుంది. కళ్ళు ఉబ్బడం: కళ్ళు ఉబ్బినట్లుగా అనిపిస్తుంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అర్థం. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ నిజంగానే ఎక్కువగా ఉత్పత్తి అయితే, డబుల్ విజన్, బరువు పూర్తిగా తగ్గిపోవడం, చూపు తగ్గిపోవడం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనురెప్పలు పడిపోవడం: కనురెప్పలు కన్నుమీద పూర్తిగా పడిపోతున్నట్లుగా ఉంటే, రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి లక్షణానికి వేరే కారణాలు కూడా ఉంటాయి.