హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
ప్రస్తుత కాలంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరంగా మారిపోయింది. పెరుగుతున్న ఖర్చులు, అనుకోని అనారోగ్యాల కారణంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు, ఇన్స్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన కొన్ని నిబంధనల గురించి తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. కో పేమెంట్: అంటే, హాస్పిటల్ బిల్ ని మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే, అందులో కొంతశాతం మీరు పే చేసి ఉండాలి. ఉదాహరణకు 50వేలు బిల్ అయితే అందులో 30శాతం, 15వేలు మీరు చెల్లించాలి. తగ్గింపులు (డిడక్టబుల్స్): ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకున్నప్పుడు మీ ప్లాన్ కి డిడక్టబుల్స్ వర్తిస్తే, ఆ వర్తించినంత అమౌంట్ మీరు మీ జేబు నుండి చెల్లించాలి.
హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీల నిబంధనలు
ఉదాహరణకు మీ హాస్పిట;ల్ బిల్ 30వేలు అయ్యింది. కానీ మీ ప్లాన్ ప్రకరం 10వేలు డిడక్టబుల్ ఉంది. అప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీ కేవలం 20వేలు మాత్రమే చెల్లిస్తుంది. వెయిటింగ్ పీరియడ్: కొన్ని కొన్ని ప్రత్యేక వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట కాలం వరకు ఆ ప్రత్యేక వ్యాధులకు ఇన్స్యూరెన్స్ వర్తించదు. నో క్లెయిమ్ బోనస్: ఒకవేళ మీరు 2సంవత్సరాల్లో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మీ ఇన్స్యూరెన్స్ అమౌంట్ 50శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అడ్వైజర్ తో డిస్కస్ చేయండి. గ్రేస్ పీరియడ్: ఇన్స్యూరెన్స్ రీన్యూ చేయాలనుకుంటే 15రోజుల సమయం ఉంటుంది. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు.