
హోళీ: మీ ప్రియమైన వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఐడియాస్
ఈ వార్తాకథనం ఏంటి
పండగ అంటే పది మంది ఒకదగ్గర చేరి చేసుకునే సంతోషం. ఆ సంతోషాన్ని మరింత పెంచేవే బహుమతులు. హోళీ సందర్భంగా మీ ప్రియమైన వారికి మంచి మంచి బహుమతులు ఇవ్వండి.
ఎలాంటి బహుమతులు అందివ్వాలో మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి.
హోళీ కేక్:
పండగ రోజు స్వీట్ కన్నా మంచి ఫుడ్ ఇంకెముంటుంది. అందుకే హోళీ థీమ్ తో ఉండే కేక్ ని గిఫ్ట్ గా ఇవ్వండి. ఖచ్చితంగా మీ వాళ్ళు ఆవాక్కవుతారు. కేక్ తో పాటు చాక్లెట్లు, రసాయనాలు లేని రంగుల ప్యాకెట్లు బహుమతిగా ఇవ్వండి.
పర్సనల్ కేర్ కిట్:
రంగుల్లోని రసాయనాల కారణంగా చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మాయిశ్చరైజర్స్ వంటివి ఉన్న పర్సనల్ కేర్ కిట్ ఇవ్వండి.
హోళీ
హోళీ రోజున ఎలాంటి బహుమతులు ఇవ్వాలంటే
బుట్టనిండా రంగులు, బెలూన్లు:
రంగుల పండగ రోజు రంగులను మించిన బహుమతి ఇంకేముంటుంది. రసాయనాలు లేని రంగుల ప్యాకెట్లను బుబ్ట్టలో వేసి ఇవ్వండి. రంగు రంగుల బెలూన్లు వాటికి జత చేయండి. గోగు పువ్వులు కూడా బుట్టలో ఉంచండి. ఆర్గానిక్ గా ఉంటుంది.
హోళీ టీ షర్ట్:
హోళీ టీ షర్ట్ అనేది అదిరిపోయే ఐడియా. పండగ రోజు వేసుకుని హోళీ ఆడుతుంటే మీకెప్పటికీ గుర్తుండిపోతుంది. మీ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఒకరికొకరు బహుమతులుగా టీ షర్ట్స్ ఇచ్చుకుని అందరూ ఒకే చోట హోళీ ఆడుతుంటే ఆ మజాయే వేరు.
దేవతా విగ్రహాలు:
పండగ రోజు మరింత ప్రత్యేకంగా ఉండాలంటే దేవతా విగ్రహాలను బహుమతిగా అందించవచ్చు.