Divorce Temple : ప్రపంచంలోనే వింత ఆలయం.. ఇంతకీ ఎక్కడంటే.. ?
ప్రపంచంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. రకరకాల కోర్కెలకు రకరకాల దేవాలయాలు ఉంటాయి. అలా కోరిన కోర్కెలు నెరవేర్చే దేవాలయాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ విడాకులకు కూడా దేవాలయం ఉందంటే నమ్ముతారా?.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. జపాన్‌లో ఉన్న ఈ దేవాలయం పేరు మాస్తుగావోకా టోకీజీ. వాస్తవానికి 12,13 శతబ్దాలలో విడాకులు ఇచ్చే స్వతంత్రం పురుషులకు మాత్రమే ఉండేది. స్త్రీలకు వివాహమయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. విడాకులు అడిగే స్వేచ్ఛ, స్వతంత్రం అప్పట్లో ఉండేవి కాదు. మహిళలపై సామాజిక కట్టుబాట్లు ఉండేవి. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీలు.. నిస్సహాయులుగా ఉండేవారు.
మాస్తుగావోకా టోకీజీ చరిత్ర
ఈ విడాకుల ఆలయం ఖచ్చితంగా కొంచెం వింతగా అనిపిస్తుంది,కానీ దాని వెనుక కూడా ఒక కథ ఉంది. టోకీ-జి చరిత్ర సుమారు 600సంవత్సరాల నాటిది.ఈ ఆలయం జపాన్‌లోని కమకురా నగరంలో ఉంది. ఈ దేవాలయం గృహ హింసకు గురైన మహిళలకు నిలయంగా పరిగణించబడుతుంది. శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారని చెబుతారు. 1285లో బౌద్ధ బిక్షువు కాకుసాన్ షిదో-నీ నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రంగా మారింది. మరణించిన తన భర్త హోజో టోకిమునే జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించారామె. బౌద్ధమందిరంగా విలసిల్లుతోన్నఈ ఆలయంలో పెళ్లై..విడాకులైన ఒంటరి మహిళలు ఇక్కడే వచ్చి ఆశ్రయం పొందేవారు. అంతేకాదు. వివాహం పేరుతో చిత్రవధకు గురైన వారికీ ఆశ్రయమిచ్చేవారు.
విడాకులు ఇలా జరిగేవి
జపాన్‌లోని కామకురా యుగంలో, స్త్రీల భర్తలు ఎటువంటి కారణం చెప్పకుండా వారి వివాహాన్ని విచ్ఛిన్నం చేసేవారు. ఇందుకోసం మూడున్నర లైన్ల నోటీసు రాయాల్సి వచ్చింది. ప్రజలు ప్రకారం, మహిళలు ఈ ఆలయంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత వారి భర్తలతో సంబంధాలు తెంచుకోవచ్చు. కాలక్రమేణా ఇది తర్వాత రెండేళ్లకు తగ్గించారు. పురుషులకు అనుమతి లేదు1902 సంవత్సరం వరకు, ఆలయంలో పురుషులకు అనుమతి లేదు. కానీ దీని తరువాత, 1902లో ఈ ఆలయ సంరక్షణను ఎంగాకు-జీ స్వీకరించినప్పుడు, అయన మగ మఠాధిపతిని నియమించాడు.
చరిత్రతో ముడిపడి ఉన్న కళాకృతులు
ఈ ఆలయంలో ఉన్న ఓ సంగ్రహాలయంలో.. ఆలయ చరిత్రతో ముడిపడి ఉన్న కళాకృతులు కనిపిస్తాయి. నాటి మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే ఆనవాళ్లు కూడా ఉన్నాయి. బౌద్ధమతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరిగేవి. ఇప్పటికీ ఆలయంలోని బౌద్ధ భిక్షువులు, నన్ లు ఈ ఆలయానికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతనిస్తుందని చెబుతారు.