
Water Plants: నీటిలోనే పెరిగే తొమ్మిది రకాల మొక్కలు - ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
మొక్కల పెరుగుదలకు మట్టి, నీరు అత్యవసరమైనవి. నగర జీవనశైలిలో, అపార్ట్‌మెంట్లలో నివసించే చాలామందికి మట్టితో మొక్కలు పెంచడం కష్టంగా మారిపోతుంది
మట్టి వాడితే బాల్కనీ మురికిగా మారుతుందనే భయం కూడా ఉంటుంది. ఈ కారణంగా, చాలా మంది మొక్కలు పెంచడాన్ని మానేస్తున్నారు.
అయితే, కొన్ని ప్రత్యేకమైన మొక్కలు మట్టి అవసరం లేకుండా, కేవలం నీటిలోనే బతికేస్తాయి.
అలాంటి మొక్కల జాబితా ఇదిగో!
ఇవన్నీ నీటిలో పెరిగే మొక్కలే. అయితే, మట్టిలోనూ పెరుగుతాయి కానీ, మట్టి లేకపోయినా చక్కగా ఎదుగుతాయి. వీటిని చిన్న గాజు సీసాల్లో పెంచుకోవచ్చు. అన్ని నర్సరీలలో కూడా ఈ మొక్కలు లభిస్తాయి.
వివరాలు
1. స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్ చాలా సులభంగా లభించే మొక్క. ఇది మట్టిలోను, నీటిలోను బలంగా పెరుగుతుంది. చాలామందికి నీటిలోనూ దీని వృద్ధి సాధ్యమని తెలియదు. దీన్ని గాజు సీసాలో నీటిలో ఉంచి, మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచితే చాలు, ఆరోగ్యంగా పెరుగుతుంది.
2. స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్ అన్ని నర్సరీల్లో లభిస్తుంది. చిన్న కొమ్మలుగా పెరిగే ఈ మొక్క మట్టి అవసరం లేకుండా,కేవలం నీటిలోనే ఆరోగ్యంగా ఎదుగుతుంది. గాజు గ్లాస్‌లో నీరు పోసి ఉంచితే చాలు, చక్కగా పెరుగుతుంది.
3. మాన్‌స్టెరా
పెద్ద ఆకులతో ఆకర్షణీయంగా ఉండే మాన్‌స్టెరా మొక్క,మెత్తటి మట్టిలోను,నీటిలోను చక్కగా పెరుగుతుంది.ఒక కాండాన్ని తీసి నీటిలో ఉంచితే,కాస్త వెలుతురున్న ప్రదేశంలో ఉంచితే,త్వరగా వేరు తీసుకుని ఎదుగుతుంది.
వివరాలు
4. మనీ ప్లాంట్
ఇంట్లో అందాన్ని పెంచే మనీ ప్లాంట్, నేలలోనూ, నీటిలోనూ పెరుగుతుంది. దీన్ని పెంచడం చాలా ఈజీ. తీగను నీటిలో ఉంచి, కాస్త వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచితే చాలు, ఆకర్షణీయంగా ఎదుగుతుంది. అయితే, మట్టితో పోలిస్తే నీటిలో పెరుగుదల కాస్త నెమ్మదిగా ఉంటుంది.
5. లక్కీ బాంబూ
ఇది ఒక రకం వెదురు మొక్క. దీన్ని ఇంట్లో పెంచితే శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. చిన్న పరిమాణంలో ఉండే ఈ మొక్క ఎక్కువగా అలంకారానికి ఉపయోగిస్తారు. దీన్ని నీటితో నింపిన గాజు జాడీలో, అందంగా చిన్న రాళ్లు వేసి పెంచుకోవచ్చు.
వివరాలు
6. పుదీనా
పుదీనా మొక్కను హైడ్రోపోనిక్ విధానంలో, అంటే మట్టి లేకుండా నీటిలో పెంచుకోవచ్చు. ఆకుల కాండాన్ని నీటిలో ఉంచి, కాస్త వెలుతురు ఉండే ప్రదేశంలో పెడితే, ఆరోగ్యంగా పెరుగుతుంది.
7. స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు)
చిన్న స్థలంలో పెంచదగిన మొక్కలలో ఉల్లికాడలు ఒకటి. గాజు గ్లాస్‌లో నీటిని పోసి ఉంచితే, వేర్లు నెమ్మదిగా పెరిగి కొత్త ఆకులు వస్తాయి. రోజుకు కనీసం నాలుగు గంటల పాటు సూర్యకాంతి అందేలా చూసుకోవాలి.
వివరాలు
8. కలబంద
కలబంద ఆరోగ్యానికి, అందానికి ఎంతో ఉపయోగకరమైనది. ఇది మట్టిలో మాత్రమే కాదు,నీటిలో కూడా సులభంగా పెరుగుతుంది. దీన్ని పెంచడానికి కాస్త పెద్ద గాజు కంటైనర్ అవసరం అవుతుంది.
9. టిల్లాండ్సియా
టిల్లాండ్సియా మొక్కలు నర్సరీలలో దొరుకుతాయి. ఇవి గాలి నుండే పోషకాలను తీసుకుంటాయి. కాబట్టి, నీటిలో ఉంచి, గాలి, వెలుతురున్న ప్రదేశంలో పెడితే చాలు, చక్కగా ఎదుగుతుంది.