
కంప్యూటర్ తో ఛాటింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన బెల్జియం దేశస్తుడు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తుంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటివి పుట్టుకొచ్చాయి.
ఇకపై మనిషికి మరో మనిషి అవసరం లేకుండా అన్నీ, టెక్నాలజీతో పూర్తయ్యే పనులే ఉంటాయని అర్థమవుతోంది. అయితే ఈ టెక్నాలజీయే ఒక్కోసారి మనుషుల ప్రాణాలు తీసేలా మారుతుంది.
తాజాగా బెల్జియంలో జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ. బెల్జియంకు చెందిన పౌరుడు, వాతావరణ మార్పుల గురించి ఎక్కువగా ఆలోచించే వాడు.
వాతావరణంలోని మార్పుల కారణంగా భూమి మీద వచ్చే ఇబ్బందులు, మొదలగు విషయాల గురించి ఆలోచించి, డిప్రెషన్ కు గురయ్యాడు. దానివల్ల ఫ్యామిలీకి దూరమై కంప్యూటర్ తో స్నేహం మొదలెట్టాడు.
చాట్ బాట్
ఆరువారాలు ఒంటరిగా చాట్ బాట్ తో ఛాటింగ్
సుమారు ఆరు వారాల పాటు ఒంటరిగా ఉంటూ ఛాయ్ అనే యాప్ చాట్ బాట్ తో ఛాటింగ్ చేస్తూ గడిపాడు. ఈ క్రమంలో చాట్ బాట్, ఆ పర్సన్ ని తప్పు దారిలోకి తీసుకెళ్ళింది.
అతని మనసును మరింత గాబరాకు గురిచేసి కంగారు పెట్టింది. తన భార్య పిల్లల గురించి ఏవేవో మాటలు చెప్పి, మనిద్దరం స్వర్గంలో కలిసి ఉండవచ్చని చెప్పింది.
దీంతో, ఆ పర్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని బెల్జియంకు చెందిన లా లిబర్ ప్రచురించి.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి భార్య చెప్పిన విషయాల ప్రకారం, చాట్ బాట్ తో ఛాటింగ్ చేయకుండా ఉంటే తన భర్త ఇప్పటికీ బతికే వాడనీ ఆమె వాపోయింది.