
Travel India: వేసవిలో స్విట్జర్లాండ్ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో వేసవి కాలంలో మండే ఎండల కారణంగా ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో బాధపడుతున్నారు.
అయితే హిమాలయాల ఒడిలోని కొన్ని ప్రదేశాలు వేసవి కాలంలో ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వకుండా, చూసేందుకు కూడా సొగసైన స్వర్గధామాలులా ఉంటాయి.
వేసవి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ప్రజలు చల్లని ప్రదేశాలకు వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు తరలుతారు.
ఎత్తైన పర్వతాలు, మంచుతో నిండిన లోయలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్విట్జర్లాండ్‌తో పోల్చుకుంటారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అక్కడ పర్యటనకు వెళ్ళాలనుకుంటారు.
Details
ప్రకృతి, పర్వాత మధ్య ప్రశాంతంగా గడపొచ్చు
ఇక మన భారతదేశంలో కూడా కొన్ని హిల్ స్టేషన్లు స్విట్జర్లాండ్‌లా సుందరంగా ఉంటాయి. ఇవి 'మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి పొందాయి.
ఈ వేసవిలో మీరు ఈ ప్రదేశాలను సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
ప్రకృతి, పర్వతాల మధ్య ప్రశాంతంగా గడిపే అనుభూతిని పొందవచ్చు. అలాగే సాహసయాత్రలను కూడా ఆస్వాదించవచ్చు.
Details
ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్
ఖజ్జియార్‌ను మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ పచ్చదనం ప్రాకారంగా విస్తరించి ఉంటుంది.
మధ్యలో అందమైన ఒక సరస్సు ఉంది. చుట్టూ పైన్ చెట్లు విస్తరించి ప్రకృతి అందాలను మెరుపరుస్తాయి.
ఇది హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా, డల్హౌసీ నుండి సుమారు 22 కి.మీ దూరంలో ఉంది.
ఇక్కడ గుర్రపు స్వారీ, పిక్నిక్, ఫోటోగ్రఫీ వంటి కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు, సరస్సు సమీపంలో సంతోషంగా సమయం గడపవచ్చు.
Details
గుల్మార్గ్, జమ్మూ-కశ్మీర్
గుల్మార్గ్ అంటే 'పువ్వుల లోయ' అని అర్థం. వేసవిలో ఇది పచ్చని పొలాలతో, చల్లని గాలితో ముద్దుగా ఉంటుంది. శీతాకాలంలో మంచుతో ముంచెత్తుతుంది.
అందుకే దీనిని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు.
ఇది శ్రీనగర్ నుండి సుమారు 50 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ గొండోలా రైడ్ (కేబుల్ కార్), ట్రెక్కింగ్, స్నో స్పోర్ట్స్ వంటి అనేక సాహసిక కార్యకలాపాలు చేయవచ్చు.
Details
ఔలి, ఉత్తరాఖండ్
ఔలి ప్రాంతం స్కీయింగ్ కోసం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడి నుండి నందా దేవి సహా మంచుతో నిండిన పర్వత శిఖరాలు సుప్రసిద్ధంగా కనిపిస్తాయి.
వేసవిలో కూడా చల్లటి వాతావరణం ఇక్కడ ప్రసాదిస్తుంది. స్విట్జర్లాండ్‌కు తక్కువగా లేని ఈ ప్రదేశంలో స్కీయింగ్, ట్రెక్కింగ్, కేబుల్ కార్ రైడింగ్ వంటి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.
ప్రకృతి దగ్గర ప్రశాంతంగా గడపడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం.
Details
చోప్తా, ఉత్తరాఖండ్
చోప్తా ప్రదేశం ప్రశాంతమైన హిల్ స్టేషన్‌గా ఉంటుంది. ఇక్కడ భారీ జనం తక్కువగా ఉండటంతో ఇది చల్లని పచ్చని గడ్డి వాలులతో, మంచుతో ముంచెత్తిన పర్వతాలతో యూరప్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఈ కారణంగా దీన్ని కూడా "మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా"గా పిలుస్తారు. ట్రెక్కింగ్ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులకు చోప్తా ఒక స్వర్గధామంలా ఉంటుంది.
ఈ వేసవిలో మీరు ఈ 'మినీ స్విట్జర్లాండ్' ప్రదేశాలను సందర్శించి, ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంలో క్షణాలను ఆస్వాదించవచ్చు.