LOADING...
Motivation: ఆచార్య చాణక్య హెచ్చరిక.. ఈ తప్పులు చేయడం వల్ల జీవితంలో భారీ నష్టాలు!
ఆచార్య చాణక్య హెచ్చరిక.. ఈ తప్పులు చేయడం వల్ల జీవితంలో భారీ నష్టాలు!

Motivation: ఆచార్య చాణక్య హెచ్చరిక.. ఈ తప్పులు చేయడం వల్ల జీవితంలో భారీ నష్టాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా జీవన విధానాన్ని మార్చగలిగే విలువైన సూత్రాలను అందించారు. ఆయన సూచనలు వ్యక్తిగత జీవితం నుంచి కుటుంబం, సంబంధాలు, ఆర్థిక స్థితి, పరిపాలన వరకు విస్తృతంగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పురుషులు తప్పక పాటించాల్సిన కొన్ని నియమాలను ఆయన వివరించారు. వాటిని పట్టించుకోకపోతే గౌరవం కోల్పోవడం, ఆర్థిక నష్టం, సంబంధాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు.

Details

స్త్రీల పట్ల గౌరవం

చాణక్యుని దృష్టిలో స్త్రీలను అగౌరవపరచడం ఒక పురుషుడు చేసే అత్యంత పెద్ద తప్పు. స్త్రీలు శక్తి, దయ, ప్రేమ, సంస్కృతికి ప్రతీకలు. వారిని తక్కువ చేసి చూడడం లేదా అనుచితంగా ప్రవర్తించడం వల్ల ఆర్థిక సమస్యలు, సామాజిక అవమానం, ఆత్మగౌరవ నష్టం వంటి అనర్థాలు వస్తాయి. స్త్రీలతో గౌరవంగా వ్యవహరించే వారికే జీవితంలో శాంతి, స్థిరత్వం, గౌరవం దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.

Details

కోపంలో తీసుకునే నిర్ణయాలు 

చాణక్యుని మాటల ప్రకారం, కోపం మన ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది. అలాంటి సమయంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుల దారి పట్టించే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమైన నిర్ణయాల ముందు మనసును ప్రశాంతంగా ఉంచి ఆలోచించడం అవసరం. శాంతంగా తీసుకున్న నిర్ణయమే విజయానికి మార్గం అవుతుందని ఆయన చెప్పారు. స్నేహితుల ప్రభావం ఎవరి స్నేహం చేస్తామో మన వ్యక్తిత్వం కూడా వారిలా మారుతుందని చాణక్యుడు అన్నారు. సోమరులు, మోసగాళ్లు, ప్రతికూల ఆలోచనలు ఉన్నవారితో ఉంటే మనమూ ఆ దిశగా వెళ్ళే ప్రమాదం ఉంది. మరోవైపు, మంచి ఆలోచనలు, సానుకూల దృక్పథం కలిగిన వారితో స్నేహం చేస్తే మనలో సానుకూల మార్పులు, విజయ మార్గం, ఉత్తమ వ్యక్తిత్వం వస్తాయి.

Details

గర్వం చివరికి పతనమే

ధనం, అధికారంపై గర్వపడే వారు చాణక్యుని దృష్టిలో ఎక్కువ కాలం నిలబడలేరు. కాలం మారిపోతుంది. ఈ రోజు ఉన్నవి రేపు లేకపోవచ్చు. కాబట్టి వినయం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలిగిన వారినే నిజమైన పురుషులుగా ఆయన పేర్కొన్నారు. రహస్యాలను పంచుకోవడంలో జాగ్రత్త ప్రతి రహస్యాన్ని అందరితో పంచుకోవడం పెద్ద తప్పు అని చాణక్యుడు హెచ్చరించారు. ప్రత్యేకించి పురుషులు తమ బలహీనతలు, వ్యక్తిగత విషయాలు, ప్రణాళికలు కేవలం నమ్మకమైనవారికే చెప్పాలి. అవి ఇతరుల చేతికి వెళితే దుర్వినియోగం అయ్యే అవకాశముందని ఆయన సూచించారు.