
Air India: సీనియర్ సిటిజెన్ల కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజెన్లకు శుభవార్త ప్రకటించింది. 60ఏళ్లు, ఆపైబడిన ప్రయాణికులకు దేశీయ, అంతర్జాతీయ విమానయానాల కోసం ప్రత్యేక రాయితీలను పొందగలుగుతారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణాల కోసం.. ఎయిర్ ఇండియా కొత్త స్కీమ్ ప్రకారం, టికెట్ బేస్ ధరపై 10% తగ్గింపు అందిస్తుంది. ఈ రాయితీ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ వంటి అన్ని క్యాబిన్ తరగతులకు వర్తిస్తుంది. ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత కూడా ప్రయాణ తేదీని మార్చవచ్చు, అయితే చార్జీలలో తేడా ఉన్నట్లయితే అదనపు చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
దేశీయ విమానాల రాయితీలు:
ప్రయాణికులకు అదనంగా 10 కేజీలు లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎకానమీ,ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో రెండు లగేజీలు, ఒక్కోటి 23 కేజీల బరువు వరకు తీసుకెళ్లవచ్చు. బిజినెస్ క్లాస్ లోని ప్రయాణికులు రెండు లగేజీలు, ఒక్కోటి 32 కేజీల బరువు వరకు తీసుకెళ్లవచ్చు. దేశీయ ప్రయాణాల్లో సీనియర్ సిటిజెన్లకు టికెట్ బేస్ ధరలో 25% తగ్గింపు లభిస్తుంది. సీనియర్ సిటిజెన్ ఆప్షన్‌ని ఎంచుకున్న సందర్భంలో మాత్రమే ఈ రాయితీ పొందవచ్చు. ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత తేదీ మార్చవచ్చు.అదనంగా 15 కేజీల బ్యాగేజీ తీసుకెళ్ళడానికి అనుమతి ఉంటుంది. తద్వారా, ప్రోమోకోడ్ ఉపయోగించి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన సీనియర్ సిటిజెన్లకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
వివరాలు
ఆఫర్ పొందడం ఎలా:
ఈ సౌకర్యం ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ మరియు యాప్ ద్వారా పొందవచ్చు. సీనియర్ సిటిజెన్లు ఎయిర్‌పోర్ట్ టికెటింగ్ ఆఫీసులు,ఎయిర్ ఇండియా వెబ్‌సైట్,యాప్ లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ బుక్ చేసేటప్పుడు పుట్టిన తేదీని నిర్ధారించే చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ చూపించాలి. టికెటింగ్, చెక్‌ఇన్, బోర్డింగ్ సమయంలో కూడా ఐడీని సమర్పించడం తప్పనిసరి. ఐడీను సమర్పించడంలో విఫలమైన సందర్భంలో పెనాల్టీ కూడా పడొచ్చు. ఈ స్కీమ్ ప్రకారం ఒకవేళ ఎయిర్ ఇండియా ఏవైనా మార్పులు ప్రకటిస్తే తప్ప, వన్-వే, రిటర్న్ బుకింగ్స్‌లో రాయితీలు వర్తిస్తాయి. అయితే, భవిష్యత్తులో స్కీమ్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా తన షరతుల్లో వెల్లడించింది.