Ajwain Leaves : ఈ ఆకులు రోజూ తింటే అద్భుత ఫలితాలున్నాయని తెలుసా
ఆయుర్వేదంలో చాలా రకాల మెుక్కలను ఔషధంగా వాడతారు. అయితే వాటిల్లో వాము ఆకు అద్భుత సంజీవనిగా పనిచేస్తుంది. ఈ ఆకులను ఆరోగ్య సమస్యలను తొలగించేందుకు కోసం పూర్వకాలం నుంచే వినియోగిస్తున్నారు. వాము తింటే కారం కారం ఉంటుందని అని అంతా అంటుంటారు. అయినప్పటికీ ఇది శరీరానికి చాలా మంచిది. వాము ఆకులు సుగంధం, ఘాటుగా ఉంటాయి. జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు వచ్చినప్పుడు వెనుకటికి ఇంట్లోని పెద్దలు ఈ ఆకులను పిండి రసం ఇచ్చేవారు. దీంతో రోగాలన్నీ మటుమాయమయ్యేవి. ఈ ఆకులను రోజూ నమిలి తింటుంటే, అందులోని ఔషధగుణాలు శరీరంలో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తాయి. మీ నోటి నుంచి ఎల్లప్పుడూ దుర్వాసన వస్తే, వాము ఆకులను రోజూ నోట్లో వేసుకుని నమలండి.
వాము ఆకు ఔషధ గుణాలు ఇవే :
ఇందులోని యాంటీ మైక్రోబియల్ గుణాలు చెడు వాసనలకు కారణమయ్యే క్రిములను చంపేస్తాయి. ఈ మేరకు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నోటిని శుభ్రంగా, తాజాగా ఉంచుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. వాము ఆకులను రోజూ నమిలితే అందులో ఉండే విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, శరీరాన్ని వ్యాధులు, రోగకారకాల నుంచి కాపాడతాయి. పిల్లలు కూడా ఈ ఆకులను చక్కగా నమిలి తినొచ్చు. మీరు ఊబకాయంతో బాధపడితే వాము ఆకులను రోజూ స్వీకరించడం మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆకులు ఆకలిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వాము ఆకులను తీసుకోవచ్చు.
చట్నీ రూపంలోనూ తీసుకోవచ్చు
ఆహారం తీసుకున్న తర్వాత కూడా వాము తినవచ్చు. అదే సమయంలో ఈ ఆకుతో చట్నీ తయారు చేసి అల్పాహారంతో తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు వాము ఆకులను తింటే ఇందులోని విటమిన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.శరీరంలోని జీవక్రియను పెంచుతాయి. ఈ ఆకులు పొత్తికడుపు కండరాలను సడలించి, అపానవాయువు, మలబద్ధకం వంటి లక్షణాలను నివారించడంలో ముందుంటాయి. వాము ఆకుల్లో ఏమేం ఉంటాయి : విటమిన్ A, C, సెలీనియం, జింక్ తదితరాలు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ఇవి సమతుల్యంగా ఉంచి, హార్మోన్లను రెగ్యూలేట్ చేయడంలో సాయపడతాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంది. మొటిమలు, ఇతర చర్మ సమస్యలతో పోరాడేందుకు ఉపకరిస్తుంది.