Amrit Udyan: ఆగస్టు 16 నుండి సందర్శకుల కోసం అమృత్ ఉద్యాన్.. ప్రత్యేకతలు ఏంటంటే ..?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న (ఆగస్టు 14) అమృత్ ఉద్యాన్ వేసవి వార్షిక సంచిక 2024ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సోమవారం తప్ప (గార్డెన్ నిర్వహణ) ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు గార్డెన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. చివరి ప్రవేశం సాయంత్రం 5:15 వరకు అనుమతించబడుతుంది. పార్క్‌లోకి ప్రవేశించడానికి టిక్కెట్‌లను ఎక్కడ బుక్ చేసుకోవాలంటే . .
అమృత్ ఉద్యాన్ అధికారిక ప్రకటనకు సంబంధించిన పోస్ట్
అమృత్ ఉద్యాన్‌ను సందర్శించడానికి రిజిస్ట్రేషన్ అవసరం
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న క్రీడాకారులకు, సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పార్కును సందర్శించడం ఉచితం, అయితే ప్రవేశానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కూడా పేర్కొంది. పర్యాటకులు రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్ visit.rashtrapatibhavan.gov.inలో ఆన్‌లైన్‌లో తమ స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?
ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే, పర్యాటకులు రాష్ట్రపతి భవన్‌లోని గేట్ నంబర్ 35 వెలుపల ఉన్న సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ ద్వారా తమను తాము నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి భవన్‌లోని గేట్ నంబర్ 35 నార్త్ అవెన్యూ రోడ్డుకు సమీపంలో ఉంది. ఇది కాకుండా సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుండి గేట్ నంబర్ 35 వరకు పర్యాటకుల సౌకర్యార్థం ఉచిత షటిల్ బస్సు సర్వీసు కూడా అందుబాటులో ఉంటుంది.
అమృత్ ఉద్యానవనంలో ఈ సారి ఈ అంశాలు ప్రత్యేకం కానున్నాయి
రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా మాట్లాడుతూ.. అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించే ప్రజలకు పర్యావరణ అనుకూల సావనీర్‌గా తులసి గింజలతో తయారు చేసిన 'విత్తన ఆకులను' అందజేస్తామని, వీటిని ప్రజలు మట్టిలో విత్తుకుని పర్యావరణ పరిరక్షణలో భాగమవుతారు. ఇది మాత్రమే కాదు, అమృత్ ఉద్యాన సందర్శకుల కోసం 'స్టోన్ అబాకస్', 'సౌండ్ పైప్' 'మ్యూజిక్ వాల్' వంటి ఆకర్షణలు కూడా ఉంటాయి, పిల్లలు కూడా చాల సంతోషపడతారు.
అమృత్ ఉద్యానానికి ఎందుకు అంత పేరు వచ్చింది?
అమృత్ ఉద్యాన్ లో అనేక పువ్వులు, మొక్కలతో అలంకరించి ఉండడంతో అది ప్రసిద్ధి చెందడానికి కారణం అయ్యింది. మదర్ థెరిసా, క్వీన్ ఎలిజబెత్ వంటి ప్రముఖ వ్యక్తుల పేర్లతో 159 రకాల గులాబీలు ఉన్నాయి. ఇవి కాకుండా తులిప్స్, ఆసియాటిక్ లిల్లీస్, డాఫోడిల్, హైసింత్, ఇతర కాలానుగుణ పువ్వులు కూడా ఉన్నాయి. తెలిసిన 101 రకాల బౌగెన్‌విల్లాలో, 60 పండిస్తారు. అలాగే ఇక్కడ దాదాపు 50 రకాల చెట్లు, పొదలు, తీగలు ఉన్నాయి.
సర్ ఎడ్విన్ లుటియన్స్ 1917లో ఈ తోటను రూపొందించారు
రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, జమ్ముకశ్మీర్‌లోని మొఘల్ గార్డెన్స్, తాజ్ మహల్ చుట్టూ ఉన్న తోటలు, భారతదేశం, పర్షియా చిత్రాల నుండి అమృత్ ఉద్యానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించబడింది. అమృత్ ఉద్యాన్‌లో రెండు నిర్మాణ శైలులు మిళితం చేయబడ్డాయి. 1917లో సర్ ఎడ్విన్ లుటియన్స్ అమృత్ ఉద్యానానికి రూపకల్పన చేశారని, 1928-1929లో అందులో చెట్లను నాటారు.