Anantha Chaturdashi: అనంత చతుర్దశి పూజా ముహూర్తం, గణేష్ నిమజ్జనం సమయాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
గణేష్ చతుర్థి రోజున గణపతిని పూజించడం మొదలుపెట్టి పది రోజుల తర్వాత గణేశుడుకి వీడ్కోలు పలికి నిమజ్జనం చేస్తారు.
గణేష్ చతుర్థి నుండి పది రోజుల తర్వాత వచ్చే రోజును అనంత చతుర్దశి అంటారు. ఈరోజునే గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.
ఈ ఏడాది అనంత చతుర్దశి సెప్టెంబర్ 27వ తేదీన రాత్రి 10:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 6:49 గంటల వరకు ఉంటుంది.
ఈ నేపథ్యంలో అనంత చతుర్దశి పూజా ముహూర్తం, ఇంకా గణేష్ నిమజ్జనం సమయాల గురించి తెలుసుకుందాం. అనంత చతుర్దశి పూజ ముహూర్తం సెప్టెంబర్ 28వ తేదీన 6:12 గంటల నుండి 6:49 గంటల వరకు ఉంది.
Details
అనంత చతుర్దశి రోజున మహావిష్ణువు పూజ
అనంత చతుర్దశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఇదే రోజున గణేశుడిని నీళ్లలో నిమజ్జనం చేస్తారు.
గణేష్ నిమజ్జనం సమయాలు:
సాధారణంగా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకమైన సమయాలు లేవు. గణేష్ చతుర్థి నుండి పది రోజుల తర్వాత వచ్చే అనంత చతుర్దశి రోజున వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొంటారు. సాధారణంగా సూర్యాస్తమయం కంటే ముందుగా గణేశుడిని నిమజ్జనం చేయాలని చెబుతారు.
గణేష్ నిమజ్జనం సమయంలో పాటించాల్సిన మంత్రాలు
మూషిక వాహన మోదక హస్త
చామర కర్ణ విలంబిత సూత్ర
వామన రూప మహేశ్వర పుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే.... అంటూ నిమజ్జనం చేయాలి.