Page Loader
గోధుమపిండితో చేసిన వంటకాలు తింటే సమస్యలొస్తాయా..?
గోధుమపిండితో చేసిన వంటకాలు తింటే సమస్యలొస్తాయా..?

గోధుమపిండితో చేసిన వంటకాలు తింటే సమస్యలొస్తాయా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 20, 2023
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

గోధుమపిండితో చేసిన వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోధుమపిండితో రోటీలూ, పూరీలతో పాటు పాశ్చాత్య పద్ధతుల్లో చేసే బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కెట్లు వంటివి తిన్నప్పుడు 'సీలియాక్ డిసీజ్ కారణంగా పలువురు కడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఆ ధాన్యాల పిండిలో ఉండే గ్లూటెనే దానికి కారణమని చెప్పొచ్చు. పిండి కలపడానికి నీళ్లు పోసినప్పుడు పిండిలో స్వాభావికంగా ఉండే జిగురులాంటి స్వభావాన్నిచ్చే ఓ ప్రోటీనే ఇలా పిండి ముద్దులా మర్చేందుకు సహాయపడుతుంది. దాన్నే 'గ్లూటెన్' అంటాం. కొంతమందికి ఇది సరిపోదు. గ్లూటెన్ ఉన్న పిండితో చేసిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు చిన్నపేగుల్లోని 'మైక్రోవిల్లై' అనే భాగాలు దెబ్బతింటాయి.

Details

నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తె అవకాశం

దీని వల్ల మహిళల్లో సంతానలేమి, గర్భస్రావాలు, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థ గ్లూటెన్ కు అలవాటు కాకపోవడంతో వచ్చే సమస్యను 'రిఫ్రాక్టరీ లేదా నాన్ రెస్పాన్సివ్ సీలియాక్ డిసీజ్' గా చెబుతారు. సీలియాక్ డిసీజ్ అంటే ఒకరకంగా ఫుడ్ అలర్జీ లాంటిదే. కడుపులో నొప్పి, గ్యాస్ నిండటంతో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. తలనొప్పి, ఒంటిమీద దురదతో కూడిన ర్యాషెస్, కొందరికి నోట్లో పుండ్లు కూడా ఏర్పడొచ్చు. కొందరిలో దంతాలపై ఎనామెల్ దెబ్బతినడం వల్ల ∙చిన్న పిల్లల్లో (అబ్బాయిలూ, అమ్మాయిల్లో) పెరుగుదల కాస్త మందగిస్తుంది. ఆహారం సరిగా ఒంటబట్టకపోవడంతో మరికొన్ని దుష్ప్రభావాలూ కలగవచ్చు.