Page Loader
Womens Day 2025: పురుషుల కంటే మహిళలు ఎన్ని అంశాల్లో శక్తివంతులో తెలుసా? ఈ విషయంలో స్త్రీల ముందు మగవారు తేలిపోతారు!
పురుషుల కంటే మహిళలు ఎన్ని అంశాల్లో శక్తివంతులో తెలుసా?

Womens Day 2025: పురుషుల కంటే మహిళలు ఎన్ని అంశాల్లో శక్తివంతులో తెలుసా? ఈ విషయంలో స్త్రీల ముందు మగవారు తేలిపోతారు!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళలు పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు. అయితే, ప్రాచీన కాలం నుండి ఇంటి బాధ్యతలు, వంటింటి పనులు ప్రధానంగా వారి పై నెట్టబడాయి. కానీ ఆధునిక యుగంలో, మహిళలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్ని రంగాల్లో విజయవంతంగా అడుగుపెడుతున్నారు. పరిశోధనల ప్రకారం, మహిళలు కొన్ని ముఖ్యమైన అంశాల్లో పురుషుల కంటే మెరుగ్గా ఉంటారని తేలింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంత శక్తివంతులో తెలుసుకుందాం.

వివరాలు 

జ్ఞాపకశక్తి

ఒక వ్యక్తికి మంచి జ్ఞాపకశక్తి ఉండడం ఎంతో ముఖ్యమైన విషయం. ఇందులో చూస్తే, పురుషులతో పోలిస్తే మహిళలు చాలా ముందున్నారు. వారు ఒకసారి ఏదైనా విషయం తెలుసుకుంటే దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. భావోద్వేగాలు మనిషికి భావోద్వేగాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ప్రేమ,దయ, కరుణ వంటి గుణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పురుషులతో పోలిస్తే, స్త్రీలు ఎక్కువగా ప్రేమతో వ్యవహరించగలుగుతారు. ఇతరుల పట్ల నమ్మకం, సానుభూతి చూపడంలో స్త్రీలు ముందుంటారు. ఆహారం అనేక మంది భావన ఏమిటంటే,మహిళలు తక్కువ తింటారని.కానీ నిజానికి, పురుషులతో పోలిస్తే మహిళలకే ఆకలి ఎక్కువగా ఉంటుంది. వారు ఎక్కువ పని చేసే క్రమంలో శరీరానికి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి.

వివరాలు 

తెలివితేటలు

అందుకే, స్త్రీలు పురుషుల కంటే రెండింతలు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ తెలివితేటలతో వ్యవహరిస్తారని పరిశోధనలు సూచిస్తున్నాయి. వారు సమస్యలను త్వరగా అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు కనుగొనగలరు. శారీరకంగా పురుషులు బలమైనా, మానసికంగా స్త్రీలు బలమైనవారిగా గుర్తింపు పొందారు. మానసిక స్థైర్యం, సహనశీలత విషయాల్లో పురుషుల కంటే మహిళలు మెరుగైనవారు. ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి పురుషులతో పోలిస్తే, మహిళలు ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ఒకేసారి నిర్వహించగలగడం వల్ల ఒత్తిడిని తట్టుకునే శక్తి వారికి సహజంగా ఏర్పడింది.

వివరాలు 

రోగనిరోధక శక్తి

పురుషులతో పోలిస్తే, మహిళల్లో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల శరీరంలో ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువ. మల్టీటాస్కింగ్ పురుషులు ఒకేసారి ఒక్క పని చేయగలరు, కానీ మహిళలు అనేక పనులను ఒకేసారి సమర్థంగా నిర్వహించగలరు. వారి మెదడులోని ఎడమ, కుడి భాగాల మధ్య బలమైన అనుసంధానం ఉండటం వల్ల వారు మల్టీటాస్కింగ్‌లో నైపుణ్యం కలిగి ఉంటారు.

వివరాలు 

ఉత్తమ నాయకత్వం

పని ప్రదేశంలో మహిళలు పురుషుల కంటే మెరుగైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సహజంగా సమస్యలను పరిష్కరించగల శక్తి, సమగ్రత వంటి లక్షణాలతో మహిళలు ఉత్తమ నాయకులుగా నిలుస్తారు. ఉద్యోగ సంబంధాలను సమర్థంగా నిర్వహించడం, సమష్టిగా పని చేయడం వంటి విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే ముందున్నారు. మహిళలు మానసికంగా, భావోద్వేగంగా, సామాజికంగా, ఆరోగ్య పరంగా పురుషులతో సమానంగా లేదా అంతకన్నా శక్తివంతంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల ప్రాముఖ్యత పెరుగుతున్న క్రమంలో, వీరి కృషిని గుర్తించి గౌరవించడం మనందరి బాధ్యత.