
Mangoes: అబ్బో.. తక్కువ ధరకే వస్తోందని కక్కుర్తి పడుతున్నారా? ఈ మామిడితో ఆరోగ్యానికి ప్రమాదమే!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవిలో ఎప్పుడెప్పుడు మామిడి పండ్లు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు.
మామిడిని చూడగానే తినాలనే కోరిక కలుగుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్లలో లభిస్తున్న కొన్ని మామిడి పండ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీయేలా ఉన్నాయి.
ఇందుకు ప్రధాన కారణం, వాటిని సహజంగా కాకుండా రసాయనాల సహాయంతో పండించడమే.
ముఖ్యంగా "కాల్షియం కార్బైడ్" అనే కెమికల్‌ను ఉపయోగించి పండ్లు వేగంగా పక్వం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇది తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, కడుపునొప్పులు, వికారం వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది.
అందువల్ల అలాంటి పండ్లను కొనకుండా, వాడకుండా ఉండాలి. ఇవి సహజమైనవేనా, కెమికల్స్‌తో పండించారా అనే విషయం తెలుసుకోవడమెలా అన్నదే ఇప్పుడు చూద్దాం:
వివరాలు
కెమికల్స్‌తో పండించిన మామిడిని ఎలా గుర్తించాలి?
1. వాసన ఆధారంగా గుర్తించండి: సహజంగా పండిన మామిడి పండ్లకు మధురమైన, స్వాభావికమైన వాసన ఉంటుంది. కానీ కెమికల్స్‌తో పండించిన పండ్లకు వాసన చాలామందికి లేదని తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అసలు వాసన కూడా రాదు.
2. రంగు,మచ్చలు గమనించండి: సహజంగా పండిన మామిడికి కొద్దిగా పసుపు, పచ్చ కలబోతగా ఉండే రంగు ఉంటుంది. కానీ రసాయనాలతో పండించిన పండ్లు మాత్రం ముదురు పసుపు లేదా గోధుమ రంగులో మెరుస్తున్నట్లుగా ఉంటాయి. అదేసమయంలో పండు బాగా గ్లాసీగా, మృదువుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది సహజ లక్షణం కాదు.
వివరాలు
కెమికల్స్‌తో పండించిన మామిడిని ఎలా గుర్తించాలి?
3. మెత్తదనం పరిశీలించండి: పండు బయటకు బాగానే కనిపించినా, చేతితో పట్టుకుంటే చాలా మెత్తగా ఉండడం, ఒక వైపు మాత్రమే పండినట్టు ఉండడం, మరోవైపు పచ్చగా ఉండడం వంటివి కెమికల్ వల్ల పండిన లక్షణాలుగా పరిగణించవచ్చు.
4. తొక్కపై ముడతలు గమనించండి: మామిడి తొక్కపై ముడతలు ఉంటే, అది బలవంతంగా కెమికల్స్ వాడి పండించిన పండుగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా పండు పైభాగంలో తెల్లటి లేదా బూడిద రంగు పొడి ఉండటం కూడా కాల్షియం కార్బైడ్ వాడిన గుర్తులుగా చెప్పవచ్చు.
వివరాలు
కెమికల్స్‌తో పండించిన మామిడిని ఎలా గుర్తించాలి?
5. లోపల రంగు చూడండి: బయట కనిపించడానికి పండు బాగానే ఉన్నా, లోపల గుజ్జు భాగం బ్రౌన్ కలర్‌లో ఉండటం చూస్తే అది సహజ పండుతో కాదు, కెమికల్ సహాయంతో పండిన మామిడేనని చెప్పవచ్చు.
ఆరోగ్యపరంగా ముప్పు: కాల్షియం కార్బైడ్ వాడిన మామిడి పండ్లు తినడం వల్ల నోరు మండడం, గొంతులో మంట ఏర్పడడం, కడుపునొప్పులు, వికారం, వాంతులు, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల మామిడి పండ్లు కొంటే వాటి లక్షణాలను జాగ్రత్తగా గమనించండి. తక్కువ ధర చూసి మామిడిని కొనడం వల్ల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టినట్లవుతుంది. కనుక నాణ్యమైనవి, సహజంగా పండినవే అని నమ్మకమొస్తే మాత్రమే కొనండి, తినండి.