
Arthritis : చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు విజృంభిస్తాయి.. ఈ 5 పాటిస్తే కాస్త ఉపశమనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థరైటిస్ అంటే ఏంటో పెద్దవాళ్లకు, వృద్ధులకు ఎక్కువగా తెలుస్తుంది. దీని కారణంగా కీళ్ల నొప్పులు, వాపులు, ఉబ్బటం, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఇటీవలే నడివయసు వారు ఆర్థరైటిస్ వల్ల బాధపడుతున్నారు. చలికాలంలో కీళ్ల నొప్పులు మరింత తీవ్రమవుతాయి.
కీళ్ల నొప్పులు, కండరాలు వంటివి బిగుసుకుపోయి ఎక్కువగా వేధిస్తుంటాయి. ఈ సమయంలో ఎముకలు, కీళ్ల సమస్యలకు వైద్య చికిత్సలు తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఆర్థరైటిస్ ఉంటే కీళ్లలో నొప్పి,వాపు, అలసట లాంటి సాధారణ లక్షణాలు అనిపిస్తాయి.
షుగర్ బాధితులకు కీళ్ల వాపులు, నొప్పులు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి.చల్లటి వాతావరణం కారణంగా కీళ్ల నొప్పులు విజృంభిస్తాయి.
అయితే దీన్ని నియంత్రణలో ఉంచాలంటే, కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సి ఉంది.
Details
ఈ 5 చిట్కాలు పాటిస్తే సరి
1. పసుపు :
పసుపు నీళ్లు తాగడం ద్వారా కీళ్ల వాపులు,నొప్పులు నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే కర్కిమిన్ అనే పదార్థం శరీరానికి మేలు చేస్తుంది.
2. వెల్లుల్లి :
ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల మోకీళ్ల నొప్పులు అదుపులోకి వస్తాయని నిపుణులు అంటున్నారు.
3. ఆముదం నూనె :
కీళ్లకు ఆముదంతో మర్ధన చేయడం ద్వారా నొప్పులను అదుపులో ఉంచుకోవచ్చు.
4. వేడిగా కాపడం :
శరీరంలోని మోకీళ్లు, మోచిప్పలు, జాయింట్లలో ఎక్కడైతే నొప్పులు ఉంటాయో, అక్కడ వేడి వేడిగా కాపడం పెట్టడం ద్వారా తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుంది.
5. మెంతి గింజలు :
రాత్రి 2 చెంచాల మెంతి గింజలు నానబెట్టి ఉదయాన్నే నమిలి మింగేయాలి. తర్వాత ఆ నీటిని కూడా తాగేయాలి.