బూడిద బుధవారం: క్రైస్తవులు జరుపుకునే ఈ సాంప్రదాయం గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
బూడిద బుధవారం.. వినడానికి కొత్తగా ఉంది కదూ! క్రైస్తవులు జరుపుకునే ఈ సాంప్రదాయంలో, బుధవారం రోజున తమ నుదుటికి బూడిదతో క్రాస్ సింబల్ ని పెట్టుకుంటారు.
బూడిద బుధవారం అంటే:
ఈ సాంప్రదాయాన్ని లెంట్ ప్రారంభం రోజున జరుపుకుంటారు. లెంట్ అంటే యేసుక్రీస్తు మరణించడానికి ముందు 40రోజుల కాలం అన్నమాట.
ఈ సమయంలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ కనిపిస్తారు.
బూడిద బుధవారం ఎలా వచ్చిందంటే:
చేసిన తప్పులకు పశ్చాత్తాప సింబల్ గా బూడిదను పెట్టుకోవడం జరుగుతుందని పాత క్రైస్తవ ఆచారాల్లో ఉంది. తీవ్రమైన పాపలకు పాల్పడిన వారి తలలపై బూడిదను చల్లడం అప్పట్లో సాంప్రదాయంగా ఉండేది. అదే ఇప్పుడు నుదుటి మీద క్రాస్ సింబల్ పెట్టుకుంటున్నారు.
బూడిద బుధవారం
లెంట్, బూడిద ల ప్రాముఖ్యత తెలుసుకోండి
లెంట్ అనేది బాప్టిజం కోసం మొదలైంది. బాప్టిజంలో నుదుటి మీద నీళ్ళు జల్లుతారు. కొత్తగా క్రైస్తవ మతంలోకి వచ్చిన వారు బాప్టిజం కోసం చాలారోజుల నుండి ఎదురుచూస్తారు.
ఇక బూడిద బుధవారం విషయానికి వస్తే, ఈరోజున క్రైస్తవులు చర్చిలకు వెళ్ళి అక్కడ పాస్టర్ చెప్పే ప్రసంగాలు వింటారు. దేవుని సన్నిధిలో తాము చేసిన పాపాలను ఒప్పుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కరికి బూడిదను పంచుతాడు పాస్టర్. బూడిదను నుదుటి మీద క్రాస్ సింబల్ మాదిరిగా పెట్టుకున్న తర్వాత, "నేను మట్టి నుండే వచ్చాను, మళ్ళీ మట్టిలోకే వెళతాను" అని అందరితో చెప్పిస్తారు.
బూడిద బుధవారం సాంప్రదాయం అన్ని రకాల క్రైస్తవులకు వర్తించదు. కొందరు తమ సాంప్రదాయం ప్రకారం వేరే రోజున జరుపుకుంటారు.