Atlataddi: స్త్రీల పండుగ అట్లతద్ది రోజున చదువుకోవాల్సిన కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తదియ నాడు అట్లతద్ది పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ 2025 అక్టోబర్ 9, గురువారం వచ్చింది. అట్లతద్ది పండుగను "ఉయ్యాల పండుగ"గా కూడా పిలుస్తారు. ఈ రోజు చాలా మంది కుజదోషం తొలగించడానికి, మంచి భర్తల కోసం, సుభిక్ష జీవితం కోసం వ్రతం చేస్తారు. ఇది ప్రధానంగా స్త్రీలు విశేషంగా ఆచరిస్తారు. నిజానికి అట్లతద్ది పండుగ తెలుగింట్లో ఒక అతి ముఖ్యమైన, సంప్రదాయ పండుగగా ఉంది.
వివరాలు
2025 అట్లతద్ది పండుగ
అట్లతద్ది రోజు అనేక సంప్రదాయాలు అనుసరిస్తారు. ముఖ్యంగా గోరింటాకు పెట్టడం, ఉయ్యాలలు ఊగించడం ముఖ్యమైనవి.
ఈ పండుగను దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల వారు చాలా భక్తితో జరుపుకుంటారు.
అయితే, ఉత్తర భారతదేశంలోని ప్రాంతాల్లో దీని స్థానంలో కర్వా చౌత్ పండుగ నిర్వహిస్తారు.
పెళ్లి కాని యువతులు ఈ రోజు మంచి జీవిత భాగస్వామి పొందాలని ఆశిస్తూ వ్రతం నిర్వహిస్తారు.
పెళ్లయిన స్త్రీలు భర్త దీర్ఘాయుష్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖసంపన్న జీవితం కోసం ప్రత్యేక నోములను చేసుకుంటారు.
అట్లు పంచి పెట్టడం, అట్లను నైవేద్యంగా పెట్టి తినడం, తెల్లవారుజామున చద్దన్నం తినడంతో పాటు వ్రత కథను కూడా చదవాలి.
వివరాలు
అట్లతద్ది నాడు చదవాల్సిన కథ:
ఒక ఊరిలో రాజుగారికి సుకుమారి అనే కూతురు ఉండేది. ఆమెకు నలుగురు స్నేహితురాళ్లు ఉండేవారు.
వారు బ్రాహ్మణ, వెలమ, కోమట, కాపు కులంలో ఉండే అమ్మాయిలు.
రాజకుమారి పెద్దలు చెప్పినట్లుగా, అట్లతద్ది వ్రతం చేస్తే ఆరోగ్యవంతుడైన, అందగాడు భర్త లభిస్తాడని విన్నది.
ఆమె తన స్నేహితురాళ్లకు చెప్పి అట్లతద్ది నోము నోచుకుంది. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేసింది.
మూడు జాములు తర్వాత ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఇది చూసి ఆమె అన్నలు చాలా బాధపడ్డారు.
వివరాలు
ముసలి పెళ్లి కొడుకే..
అనంతరం, తమ చెల్లెలిపై ప్రేమ చూపిస్తూ, చంద్రుడు వచ్చే వరకు చెల్లి ఉపవాసంతో ఉండలేదని.. చెల్లెలిపై ప్రేమతో అరిక కుప్పకూ నిప్పు పెట్టి ఆ మంటను అద్దంలో చూపించారు.
చంద్రుడు వచ్చాడని నమ్మిన రాజకుమారి ఫలహారం తిన్నది. ఆమె స్నేహితురాళ్లు చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించారు.
కొద్దికాలానికి రాజకుమారికి పెళ్లి జరగాలని అన్నలు ప్రయత్నించారు. ఎంత వెతికినా ఆమెకు ముసలి పెళ్లి కొడుకే వస్తున్నాడు.
కానీ ఆమె స్నేహితురాళ్లకు చక్కని భర్తలు లభించారు. చివరికి ఒక ముసలివానితో చెల్లెలి పెళ్లి నిశ్చయించారు అన్నలు.
వివరాలు
ము ఉల్లంఘన కారణంగా ఇలా జరిగింది
ఆ విషయం తెలుసుకున్న రాజకుమారి.. "అట్లతద్ది వ్రతం చేసినవారికి అందరూ మంచి భర్తలు లభించారు, నాకు మాత్రం ముసలి భర్త వచ్చాడు" అని బాధపడింది.
ఓ రాత్రి ఊరిలో వేపచెట్టు కింద తపస్సు చేసింది. అప్పుడు అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి అడవిలో ఒంటరిగా తపస్సు ఎందుకు చేస్తున్నావని అడిగారు.
రాజకుమారి తన సమస్య వివరించింది. దానికి పార్వతీ పరమేశ్వరులు "నోము ఉల్లంఘన కారణంగా ఇలా జరిగింది. మళ్లీ యధావిధిగా అట్లతద్ది నోము నోచుకుంటే పడుచు భర్త లభిస్తాడు" అని చెప్పారు.
రాజకుమారి తన అన్నలకు ఈ విషయం చెప్పి, సక్రమంగా వ్రతం జరిపింది. ఫలితంగా ఆమెకు చక్కని భర్త లభించి, సుఖసంతోషాలుతో సుఖంగా జీవించింది.