నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ గా ఉండాలంటే చేయాల్సిన పనులు
మనిషి అందంగా కనిపించాలంటే ముఖం అందంగా ఉంటే సరిపోదు. మనిషిలోని ఆత్మ అందంగా ఉండాలి. అలా ఉండాలంటే మీలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు మీకు తెలియకుండానే మీలో నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నెగెటివ్ ఎనర్జీ కారణంగా, తరచుగా కోపం రావడం, చిరాకు, అలసట, భయం, యాంగ్జాయిటీ కలుగుతుంటుంది. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దానివల్ల మీలోని రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మీరు వీక్ ఐపోతారు. ప్రతీదాంట్లో నెగెటివ్ ని చూస్తారు. ఇలాంటప్పుడు మిమ్మల్ని మీరు కడిగేసుకోవాలి. మీలోని ఆత్మను శుభ్రం చేసుకోవాలి. మీలోని చెడు ఆలోచనలు, అనవసర ఆందోళన దూరం కావాలంటే కొంత శ్రమించాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
మంచిశక్తి లోపలికి వెళ్తున్నట్టు మీ మెదడును ట్యూన్ చేయండి
స్నానం: లావెండర్ ఆయిల్ లేదా హిమాలయ ఉప్పును నీళ్ళలో వేసి, ఆ నీళ్ళతో స్నానం చేయండి. మీకు కొత్త ఫీలింగ్ వస్తుంది. షవర్ తో స్నానం చేస్తున్నప్పుడు మీలోని చెడు శక్తి బయటకు వెళ్తున్నట్టు, మంచిశక్తి లోపలికి వెళ్తున్నట్టు మీ మెదడును ట్యూన్ చేయండి. దేనిగురించి ఎక్కువ ఆలోచిస్తే దానిలాగే తయారవుతారని అంటారు కదా, అదిక్కడ వర్తిస్తుందని గుర్తుంచుకోండి. నచ్చిన మంత్రం జపించండి: మీకు నచ్చిన మాటలు గానీ, మంత్రాన్ని గానీ పదే పదే అనుకుంటూ ఉండండి. ఎవరూ లేని గదిలో కళ్ళు మూసుకుని మంత్రం జపిస్తూ, నెగెటివ్ ఎనర్జీ దూరం పోతుందని ఊహించండి. వానలో తడవడం: తుంపర్ల వానలో తడుస్తూ ఉంటే మీలో కొత్త ఫీలింగ్ వస్తుంది.