నిద్రకు సంబంధించిన రుగ్మతల వల్ల కలిగే నోటికి సంబంధించిన ఇబ్బందులు
సరైన నిద్ర వల్ల మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఒకవేళ నిద్ర సరిగ్గా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ప్రస్తుతం నిద్రకు సంబంధించిన రుగ్మతల వల్ల కలిగే నోటి అనారోగ్యాన్ని ఇక్కడ తెలుసుకుందాం. నోటి నుండి చెడు వాసన: స్లీప్ అప్నియా అనే డిజార్డర్ వల్ల నిద్రపోయినప్పుడు శ్వాస పీల్చుకోవడం కొన్ని సెకన్లపాటు ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మూములు పరిస్థితికి వస్తుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి నోటి నుండి దుర్వాసన వస్తుంది. టీఎమ్జే డిజార్డర్: స్లీప్ ఆప్నియా వల్ల ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే ఆటోమేటిక్ గా కింది దవడ ముందుకు పొడుచుకు వస్తుంది. ఇది క్రమం తప్పకుండా జరగడం వల్ల టీఎమ్జే డిజార్డర్ వస్తుంది.
స్లీప్ డిజార్డర్స్ వల్ల కలిగే నోటి అనారోగ్యం
పళ్ళు కొరకడం వల్ల తలనొప్పులు: నిద్రపోతున్నప్పుడు పళ్ళు కొరికే అలవాటు కొందరికి ఉంటుంది. దానివల్ల పళ్ళపైన ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. మెడనొప్పి, దవడ నొప్పి, పంటినొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. చిగుళ్ల నుండి రక్తం: నిద్ర సరిగా లేకపోతే దాని ప్రభావం పళ్ళమీద ఉంటుంది. చిగుళ్ళు వాచిపోవడం, చిగుళ్ళ నుండి రక్తం రావడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు పన్ను ఊడిపోయే పరిస్థితి కలుగుతుంది. అందుకే రోజుకు 7గంటల నిద్ర అవసరం. పుప్పన్ను, పళ్ళు పుచ్చిపోవడం: నిద్రపోతున్నప్పుడు ముక్కుతో కాకుండా నోటితో గాలిపీలిస్తే, నోరు ఎండిపోతుంది. దానివల్ల పుప్పన్ను ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా నోటిలో పుండ్లు, చిగుళ్ళు వాచిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి.