Summer Hairfall: వేసవిలో ఈ 4 తప్పుల వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది!
నలుపు, మందపాటి జుట్టు మన వ్యక్తిత్వాన్ని పెంచడమే కాకుండా మన విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అయితే ఎండాకాలం రాగానే జుట్టు సంబంధిత సమస్యలు పెరుగుతాయి.ఈ సీజన్‌లో జుట్టు రాలడం మొదలవుతుంది. చాలా సార్లు వేసవిలో జుట్టు రాలడానికి కారణాలు కూడా తెలియవు. కానీ నిరంతరాయంగా జుట్టు రాలడం వల్ల స్కాల్ప్ ఖాళీగా మారి కొత్త జుట్టు పెరగడం కష్టమవుతుంది. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో జుట్టు రాలడం మనం చేసే కొన్ని తప్పుల వల్ల కావచ్చు. ఈ కథనంలో, వేసవిలో జుట్టు రాలడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం..
సూర్యకాంతికి బహిర్గతం
కొందరు పనుల కారణంగా ఎండ వేడిమికి బయటకు వెళ్లాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వారి జుట్టుకి సూర్యరశ్మికి నేరుగా తగులుతుంది. దీని వల్ల సూర్యుడిలోని యూవీ కిరణాలు జుట్టులోని తేమను గ్రహించి జుట్టును నిర్జీవంగా మారుస్తుంది. మీరు ఎక్కడికైనా బయటకు వెళుతున్నట్లయితే, మీ జుట్టును స్కార్ఫ్‌తో రక్షించుకోండి. చుండ్రు ఈ సీజన్‌లో గరిష్టంగా చెమట పట్టడం జరుగుతుంది. దీని వల్ల మన జుట్టులో బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. ఈ కారణంగా, తరచుగా జుట్టులో చుండ్రు ఏర్పడుతుంది. దీని కారణంగా, జుట్టు క్రమంగా రాలడం ప్రారంభమవుతుంది.
జుట్టును గట్టిగా కట్టుకోవడం
వేసవిలో జుట్టును గట్టిగా కట్టుకోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. నిజానికి, వేసవిలో జుట్టును గట్టిగా కట్టుకుంటే, చెమట మన జుట్టులో చిక్కుకుంటుంది. దీని వల్ల నెత్తిమీద బ్యాక్టీరియా పెరగడంతోపాటు వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి. జుట్టు కడగడం వేసవిలో దుమ్ము, ధూళి, చెమట వల్ల మన జుట్టు జిగటగా మారుతుంది. అందువల్ల, జుట్టును ఎప్పటికప్పుడు కడగడం చాలా ముఖ్యం. అయితే మీరు ప్రతిరోజూ షాంపూతో మీ జుట్టును కడగడం వల్ల జుట్టు రాలడం సమస్యకు కూడా కారణం కావచ్చు.