Benefits of Barley Water: డయాబెటిస్ నియంత్రణకు బార్లీ నీరు బూస్ట్.. రోజూ తీసుకుంటే పొందే లాభాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో నయం చేయడం సాధ్యం కాకపోయినా, సరిగ్గా ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, నియమిత వ్యాయామం, వైద్యుల సూచనల ప్రకారం మందులు తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించుకోవచ్చు. ఈ కోణంలోనే బార్లీ నీరు (జావ నీరు) సహజసిద్ధంగా పనిచేసే, డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగకరమైన పానీయం గా నిపుణులు సూచిస్తున్నారు. బార్లీలో లభించే కరిగే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సాయపడుతుంది. అంతేకాక బార్లీ నీరు తక్కువ గ్లైసెమిక్ సూచిక కల్గి ఉండటంతో డయాబెటిస్ ఉన్న వారికి మరింత అనుకూలంగా ఉంటుంది.
Details
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఇందులోని అధిక ఫైబర్ శరీర బరువు నియంత్రణకు తోడ్పడుతూ, ఊబకాయం-డయాబెటిస్ మధ్య ఉండే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు బార్లీ నీరు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గుండె సమస్యలకు ఎక్కువగా గురయ్యే డయాబెటిస్ రోగులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి శరీర చురుకుదనాన్ని పెంచి రక్త చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. బార్లీ నీరు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, కణాలు గ్లూకోజ్‌ను మెరుగ్గా గ్రహించేలా చేయగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Details
ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన ప్రయోజనాలు
ఇందులో ఉండే విటమిన్-C, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ దెబ్బతినకుండా రక్షించి, డయాబెటిస్ వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి. ఈ విధంగా బార్లీ నీరు రక్తంలో చక్కెర నియంత్రణ నుండి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయని నిపుణుల సూచన. అయితే మీకు ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏవైనా సందేహాలు ఉన్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిదే