క్రమం తప్పకుండా దంతాలను చెక్ అప్ చేయించుకోవాలి.. ఈ 5 కారణాలు మీ కోసమే
దంతాలు అంటే శరీరంలోని అత్యంత గట్టిగా ఉండే భాగాల్లో ఒకటి. అయితే ఒక్కోసారి మనం తీసుకునే చర్యల వల్ల దంతాలు దెబ్బతింటుంటాయి. ఆహారాన్ని నమిలేందుకు, త్వరగా జీర్ణం చేసేందుకు దంతాలు ఎంతో పనిచేస్తాయి. చాలా మందికి దంతాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. పిప్పిపళ్లు ,చిగుళ్ల నుండి రక్తం కారడం వరకు అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో భాగంగానే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం సాధారణంగా దంతాలను చెక్ అప్ చేయించుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన దంతాల కోసం క్రమం తప్పకుండా వైద్యుడ్ని సంప్రదించడం చాలా అవసరం. దీంతో ముందుగానే ఆయా దంత సమస్యలను గుర్తించి, వాటికి మెరుగైన వైద్యం అందించేందుకు వీలవుతుంది.
క్రమం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి
1. దంత వైద్యుడ్ని క్రమం తప్పకుండా సంపద్రించాలి. దంత పరీక్షలు నిర్వహించుకోవాలి. మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు దంత ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. 2. కాలానుగుణంగా దంత పరీక్షలతో దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్ సహా ఇతర దంత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. 3. దంతవైద్యుడిని సమాయనుగుణంగా, నిర్ణీత కాల వ్యవధిలో కలవడం వైద్య చికిత్సల్లో అంతరాయం లేకుండా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇతర శారీరక వ్యాధులతో పోలిస్తే, దంత సమస్యలను గుర్తించడం కష్టం. ప్రాథమిక దశలోనే నోటి వ్యాధులను గుర్తిస్తే, వాటిని నిరోధించడంలో సహాయపడుతుంది.
నోటి పూతలను సైతం శుభ్ర పర్చుకోవచ్చు
4. స్థిరమైన దంత చెక్ అప్ వల్ల నోటి పూతలను సైతం శుభ్ర పర్చుకోవచ్చు. ఈ మేరకు దంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యకరమైన గుండె, మనస్సుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. 5. దంతాలు, దవడ ఎముకల స్థితిని తెలుసుకునేందుకు ఎక్స్ రే పరీక్షలు అవసరమవుతాయి. ఈ క్రమంలోనే రెగ్యులర్ గా చెక్-అప్‌లు చేయించుకోవడం అవసరం. ఇది కాకుండా డాక్టర్లు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో వ్యాధి కచ్చితత్వంతో నిర్థారణ అవుతుంది. దీంతో రోగికి కావాల్సిన సరైన వైద్య చికిత్సలు అందుకుని త్వరగా కోలుకుంటారు.