మేకప్: మీరు వాడే కాస్మెటిక్స్ లో ఈ రసాయనాలుంటే వెంటనే వాటిని అవతల పారేయండి
మేకప్ సాధనాలు కొనేటపుడు వాటిని తయారు చేయడానికి ఏయే పదార్థాలు వాడతారో మీరు తెలుసుకుంటారా? తెలుసుకోకుండా వాడటం అస్సలు మంచిది కాదు. కాస్మెటిక్స్ ప్రోడక్టుల్లో అనేక హానికర రసాయనాలు ఉంటాయి. తక్కువ ధరకే వచ్చాయి కదా అని ఏది పడితే ఆ ప్రొడక్టు వాడటం వల్ల మీ చర్మానికి హాని కలుగుతుంది. ప్రస్తుతం మీరు వాడే ప్రోడక్టుల్లో ఎలాంటి రసాయనాలుంటే హాని కలుగుతుందో చూద్దాం. ఆక్సిబెంజోన్: ఈ రసాయనం, అతినీల లోహిత కిరణాలను పీల్చుకుంటుంది. అందుకే సన్ స్క్రీన్లలో ఎక్కువగా వాడతారు. అయితే ఈ రసాయనం వల్ల ఎలర్జీలు, హార్మో న్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
క్యాన్సర్ కారకంగా నిలిచే రసాయనం
ఫార్మాల్డిహైడ్: హెయిర్ స్ట్రెయిట్నెంగ్ వస్తువులు, నెయిల్ పాలిష్, కనురెప్పలను అందంగా మార్చే ప్రోడక్టుల్లో ఈ రసాయనం ఉంటుంది. ఈ రసాయనం వల్ల గొంతు క్యాన్సర్, లుకేమియా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. లెడ్(సీసం): కాటుక, లిప్ స్టిక్స్ లో లెడ్ ఉంటుంది. ఇది ఎలాంటి హాని చేయదు. కాకపోతే చర్మ సాధనాల్లో దీని పర్సంటేజ్ మరీ ఎక్కువైతే చిరాకు కలిగే అవకాశం ఉంది. ఆల్కహాల్: పర్ఫ్యూమ్స్, లోషన్స్, క్రీమ్స్ లో ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ని సాధారణంగా ప్రోడక్టు పనితీరును పెంచడాని, ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి వాడతారు. అయితే ఆల్కహాల్ శాతం మరీ ఎక్కువైతే చర్మం పొడిబారిపోవడం, చర్మం పగిలిపోవడం జరుగుతుంది.